BigTV English

Diesel Exhaust Software: ఎక్కువగా డీజిల్‌ను తాగే కార్లు.. దాని వెనుక పెద్ద స్కామ్..

Diesel Exhaust Software: ఎక్కువగా డీజిల్‌ను తాగే కార్లు.. దాని వెనుక పెద్ద స్కామ్..

Diesel Exhaust Software: ఒక్కొక్కసారి మనం ఎక్కువగా ప్రయాణించకపోయినా.. కార్లలో పెట్రోల్, డీజిల్ అనేది తొందరగా అయిపోతున్నట్టు అనిపిస్తుంది. దానికి కారణం ఏంటి అని కస్టమర్లు ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇలాంటి వాటి వెనుక కార్ల సంస్థల స్కామ్ ఉంటుందని తాజాగా బయటికొచ్చింది. దీంతో జెర్మన్ ఫెడరల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ (బీజీహెచ్) విచారణ మొదలుపెట్టింది. చట్టవిరుద్ధంగా డీజిల్ ఎగ్జాస్ట్ ట్రీట్మెంట్ సాఫ్ట్‌వేర్‌లపై బీజీహెచ్ చర్యలు తీసుకోనుంది.


తమ కార్లలో డీజిల్ ఎగ్జాస్ట్ సాఫ్ట్‌వేర్ ఉందని కస్టమర్లు గుర్తిస్తే దానికి తగిన నష్టపరిహారాన్ని వారికి అందించాలని తీర్పునిచ్చింది బీజీహెచ్. ఎలాంటి నష్టపరిహారం అందించాలి అనే విషయాన్ని యూరోపియన్ కోర్టుకే వదిలేసింది. కార్ మేకర్స్ అనేవారు ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా కార్ ఇంజెన్లు ఎక్కువకాలం వరకు మెరుగ్గా పనిచేస్తాయని చెప్పి తమను తాము సమర్థించుకున్నారు. కాలుష్యం అనేది తగ్గించుకోవడానికి కూడా ఈ సాఫ్ట్‌వేర్ ఉపయోగపడుతుందన్నారు.

కార్ మేకర్స్ అనేవారు కస్టమర్లకు నష్టం కలిగించకుండా ఉండేలా ఈ సాఫ్ట్‌వేర్‌ను తయారు చేశారని నిరూపించుకోమని జెర్మన్ జడ్జీలు ఆదేశించారు. చాలావరకు ఈ సాఫ్ట్‌వేర్ అనేది మేకర్స్ నిర్లక్ష్యం వల్ల జరిగింది కాదని నిరూపించుకోమని తెలిపారు. అయితే ఈ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి 50 వేల మంది కస్టమర్లకు మోసపోయామంటూ కేసు ఫైల్ చేశామని కన్స్యూమర్ లాయర్ కోర్టులో తెలిపారు. యూరోప్‌లో ఎంతోమంది కస్టమర్లు ఇదే విషయాన్ని చెప్తున్నారని తెలిపారు.


ముందుగా 2015లో వోల్క్స్‌వేగన్ కంపెనీ ఈ థెర్మల్ విండో అనే సాఫ్ట్‌వేర్‌ను తమ కార్లలో ఇన్‌స్టాల్ చేసినట్టుగా ఒప్పుకుంది. పైగా ఇది చట్టవిరుద్ధమైన కూడా దాని గురించి బయటపడనివ్వలేదు. ఆ తర్వాత ఎన్నో కంపెనీలు కూడా తమ డీజిల్ కార్ల తయారీ విషయంలో ఇలాగే చేసినట్టు తెలుస్తోంది. కానీ ఇలాంటి కార్లు ల్యాబ్స్‌లో టెస్ట్ చేసినప్పు కాలుష్యం అనేది తక్కువగా చూపిస్తుందని కూడా దీనిపై ఆరోపణలు ఉన్నాయి. ఇదే కారణంగా చూపించి కార్ మేకర్స్ అనేవారు ఈ సాఫ్ట్‌వేర్ మంచిదని ప్రచారం చేస్తున్నారని తెలుస్తోంది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×