BigTV English

Actor’s Daughter in Defense : డిఫెన్స్‌లో నటుడి కుమార్తె.. అగ్నిపథ్ స్కీమ్ ద్వారా..

Actor’s Daughter in Defense : డిఫెన్స్‌లో నటుడి కుమార్తె.. అగ్నిపథ్ స్కీమ్ ద్వారా..
Actor's Daughter in Defense


Actor’s Daughter in Defense : మామూలుగా సినీ పరిశ్రమలో నటీనటులు లేదా దర్శకులు, నిర్మాతల వారసులు ఎక్కువగా సినీ పరిశ్రమలోనే సెటిల్ అవ్వాలని కలలు కంటుంటారు. తండ్రికి మించిన తనయుడు, తల్లికి మించిన నటి.. ఇలాంటి ప్రశంసలు పొందడానికి ఎదురుచూస్తుంటారు. ఇప్పటివరకు అలా వారసులుగా వచ్చిన ఎంతోమంది ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకొని ముందుకు వెళ్తున్నారు. కానీ ఒక నటి కుమార్తె మాత్రం తన రూటే సెపరేటు అంటోంది.

భోజ్‌పూరిలో సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపును అందుకున్నాడు రవికిషన్. తన నటనను చూసి బాలీవుడ్, టాలీవుడ్ నుండి సైతం తనకు ఆఫర్లు వచ్చాయి. తెలుగులో రేసుగుర్రం లాంటి చిత్రంలో ప్రేక్షకులకు పరిచయమయిన రవికిషన్.. రాజకీయాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. సినిమాల్లో సక్సెస్ అయినట్టుగానే రాజకీయాల్లో కూడా సక్సెస్ అయ్యి చూపించాడు. కానీ తన కూతురు మాత్రం సినిమాలకు అసలు సంబంధం లేని ఫీల్డ్‌ను ఎంచుకొని తన సొంత గుర్తింపు కోసం పాటుపడాలని ప్రయత్నిస్తోంది.


రవికిషన్ కుమార్తె ఇషితా డిఫెన్స్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్న విషయాన్ని ఈ నటుడు ఇంతకు ముందే బయటపెట్టాడు. అగ్నిపథ్ స్కీమ్ ద్వారా డిఫెన్స్‌లో జాయిన్ అయిన ఇషిత.. తాజాగా తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. అగ్నిపత్ స్కీమ్ ద్వారా డిఫెన్స్‌లో జాయిన్ అయిన విషయాన్ని స్వయంగా బయటపెట్టింది. ఇదే విషయాన్ని తన తండ్రి రవికిషన్ కూడా రీపోస్ట్ చేశాడు. ఇది చూసి నెటిజన్లు తనను ప్రశంసలతో ముంచేస్తున్నారు.

ఒక నటుడికి పుట్టి కూడా దేశానికి సేవ చేయాలనుకోవడం చాలా మంచి విషయం అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. తను చాలామందికి ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తుందని అంటున్నారు. సినీ రంగానికి చెందిన కుటుంబాల్లో పుట్టినా కూడా వేర్వేరు రంగాల్లో గుర్తింపు తెచ్చుకోవచ్చు అని చెప్పడానికి తనే ఉదాహరణ అని చెప్తున్నారు. ఒకవైపు కుమార్తె ఇషిత డిఫెన్స్‌లో బిజీగా ఉంటే రవికిషన్ ఎప్పటిలాగానే తన సినీ, రాజకీయ పనులతో బిజీగా ఉన్నారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×