E-Paper
Advertisement

Disappearing ice : కనుమరుగవ్వనున్న ఐస్.. ఆర్క్‌టిక్ సముద్రంలో..

Disappearing ice : కనుమరుగవ్వనున్న ఐస్.. ఆర్క్‌టిక్ సముద్రంలో..
Advertisement
Disappearing ice

Disappearing ice : వాతావరణ మార్పులు అనేవి ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా పెరిగిపోతున్నాయి. దీనికి గ్లోబల్ వార్మింగ్, కాలుష్యం లాంటివి కారణమని తెలిసినా శాస్త్రవేత్తలు ఏమీ చేయలేకపోతున్నారు. అందుకే దాని వల్ల కలుగుతున్న నష్టాలను చూస్తూ ఉండడం తప్పా ఏమీ చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఇంకా రానున్న పదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఈ వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాలు భయంకరంగా ఉంటాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. అందులో ఒకటి ఆర్క్‌టిక్‌లో ఐస్ కనుమరుగయిపోవడం.

Advertisement

వాతావరణ మార్పులు ఎంత తీవ్ర స్థాయికి చేరుకున్నా ఆర్క్‌టిక్‌లో ఐస్ అనేది కరిగిపోవడానికి కనీసం రెండు దశాబ్దాల సమయం పడుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. కానీ ఇప్పుడు ఒక దశాబ్దం లోపే ఇక్కడ ఐస్ అనేది కనిపించకుండా పోయే అవకాశం ఉందని వారు బయటపెట్టారు. ఇది మరింత వాతావరణ తీవ్రతకు దారితీస్తుందన్నారు. కాలుష్యం వల్ల భూమి అంతా వేడిగా అయిపోతుందని, దాని వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని వారు హెచ్చరిస్తున్నారు. 2030లో సెప్టెంబర్ వచ్చేవరకు ఆర్క్‌టిక్‌లో ఐస్ అనేది ఉండదని వారు అంచనా వేస్తున్నారు.

ఒకవేళ ఇప్పుడు అవుతున్న స్పీడ్‌లో భూమి అనేది వేడి అవ్వకపోయినా కూడా 2050 వరకు ఆర్క్‌టిక్ ఐస్ తప్పకుండా కనుమరుగయిపోతుందని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. 1979 నుండి 2019 వరకు వాతావరణంలో వచ్చిన మార్పులను క్షుణ్ణంగా స్టడీ చేసిన తర్వాతే శాస్త్రవేత్తలు ఈ అంచనాలకు వచ్చారు. ఆర్క్‌టిక్ సముద్రంలో వస్తున్న మార్పుల గురించి శాటిలైట్ డేటాతో పాటు పలు క్లైమెట్ మోడల్స్‌ను కూడా సేకరించి స్టడీ చేసి చూశారు. అందుకే ఎప్పటికైనా ఆర్క్‌టిక్ సముద్రంలోని ఐస్ కరిగిపోక తప్పదని వారు చెప్తున్నారు.

Advertisement

శాస్త్రవేత్తలు కాలుష్యాన్ని, వేడిని తగ్గించడానికి ఎంత ప్రయత్నిస్తున్నా కూడా ఆర్క్‌టిక్ ఐస్‌ను కాపాడడం తమ వల్ల కావడం లేదని శాస్త్రవేత్తలు వాపోతున్నారు. ప్రస్తుతం చలికాలంలో సముద్రం మీద ఐస్ అనేది ఏర్పడి.. వేసవి వరకు అది కరిగిపోతుందని, కానీ త్వరలోనే ఐస్ అనేది అసలు ఏర్పడకుండా ఉండడం అనేది వాతావరణ మార్పులలోని తీవ్రతను తెలిసేలా చేస్తుందని వారు అంటున్నారు. ఆర్క్‌టిక్ సముద్రంలోని ఐస్ పూర్తిగా కరిగిపోవడం వల్ల చుట్టూ ఉన్న ప్రాంతాలకు, జీవాలకు పలు రకాలుగా నష్టం కలగడం తప్పదని వారు తెలిపారు. పోలార్ బీర్స్, వాల్రసెస్, రెయిన్‌డీర్ వంటి వాటి జీవనం కష్టంగా మారుతుందని శాస్త్రవేత్తలు బయటపెట్టారు.

Related News

పిల్లలకు పుట్టినరోజు బహుమతులు ఇవ్వడమే కాదు.. జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ 7 అలవాట్లు నేర్పండి

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Big Stories

Advertisement
×