E-Paper
Advertisement

Viveka Murder Case: అవినాష్ నిందితుడే.. జగన్‌కు ముందే తెలుసు.. సీబీఐ కౌంటర్..

Viveka Murder Case: అవినాష్ నిందితుడే.. జగన్‌కు ముందే తెలుసు.. సీబీఐ కౌంటర్..
Advertisement
avinash jagan viveka

Avinash Reddy Latest News(AP breaking news today): ముందస్తు బెయిల్ వచ్చిన సంతోషం అవినాష్‌రెడ్డికి లేకుండా చేస్తోంది సీబీఐ. అరెస్ట్ నుంచి తప్పించుకున్నా.. కేసు ఉచ్చు నుంచి అంత ఈజీగా బయటపడే పరిస్థితి లేదు. ఇన్నాళ్లూ అవినాష్‌ను సహానిందితుడు, సాక్షిగా చెప్పిన సీబీఐ.. లేటెస్ట్‌గా హైకోర్టుకు సమర్పించిన కౌంటర్‌లో ఏకంగా ఏ8 నిందితుడిగా చేర్చడం కలకలం రేపుతోంది. ఇదే కౌంటర్‌లో మరోసారి సీఎం జగన్ ప్రస్తావన కూడా తీసుకురావడం పొలిటికల్ అటెన్షన్ క్రియేట్ చేస్తోంది.

వివేకా మర్డర్ కేసులో వైఎస్ భాస్కర్‌రెడ్డి వేసిన బెయిల్‌ పిటిషన్‌పై శుక్రవారం సీబీఐ కోర్టు తీర్పు ఇవ్వనుంది. అయితే, భాస్కర్‌రెడ్డికి బెయిల్‌ ఇవ్వొద్దంటూ జూన్ 5న సీబీఐ ఫైల్ చేసిన కౌంటర్‌లో అవినాష్‌రెడ్డిని 8వ నిందితుడిగా చేర్చింది.

Advertisement

వివేకా హత్యకు కుట్ర చేయడం, సాక్ష్యాలను చెరిపి వేయడంలో.. వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిల ప్రమేయం ఉందని.. అందుకు తగిన ఆధారాలు ఉన్నాయని సీబీఐ తెలిపింది. సాక్షులను ప్రభావితం చేసేందుకు వారిద్దరు ప్రయత్నిస్తున్నారని చెప్పింది.

వివేకా మర్డర్ గురించి సీఎం జగన్‌కు ఉదయం 6.15కంటే ముందే తెలుసని సీబీఐ తన కౌంటర్లో ప్రస్తావించింది. హత్య గురించి మొదట చెప్పారని అంటున్న వివేకా పీఏ కంటే ముందే.. జగన్‌కు ఆ విషయం తెలుసని తమ దర్యాప్తులో గుర్తించామని సీబీఐ స్పష్టం చేసింది.

Advertisement

భాస్కర్‌రెడ్డికి బెయిల్‌ ఇస్తే దర్యాప్తును, సాక్షులను ప్రభావితం చేస్తారని.. అతన్ని అరెస్టు చేసినప్పుడు కడపలో జరిగిన ధర్నాలు, ర్యాలీలే భాస్కర్‌రెడ్డి బలానికి నిదర్శనమని సీబీఐ తెలిపింది.

శివశంకర్‌రెడ్డి ఫోన్‌ చేసిన నిమిషంలోనే అవినాష్‌రెడ్డి హత్యా స్థలానికి చేరుకున్నారని.. ఉదయం 5.20కి ముందే అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డితో.. గంగిరెడ్డి మాట్లాడారని సీబీఐ తన కౌంటర్లో ప్రస్తావించింది.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×