BigTV English

Disney to Lay Off:టెక్ కంపెనీల బాటలో డిస్నీ

Disney to Lay Off:టెక్ కంపెనీల బాటలో డిస్నీ

Disney to Lay Off:ఆర్థిక మాంద్యం భయాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలనూ కమ్మేస్తున్నాయి. ఐటీ, ఈ-కామర్స్ కంపెనీల్లో మొదలైన ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ… ఎడ్యుటెక్, మీడియా, ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్లను దాటి… ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగానికీ వచ్చేసింది. వినోద రంగ దిగ్గజం డిస్నీ కూడా ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ఖర్చులు తగ్గించుకోవడం కోసం… భారీ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికనూ ప్రకటించింది.


దాదాపు 7 వేల మంది ఉద్యోగులను తీసేయబోతున్నట్లు డిస్నీ ప్రకటించింది. కంపెనీ వార్షిక నివేదిక-2021 ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా డిస్నీలో 1,90,000 మంది పని చేస్తున్నారు. వీరిలో 80 శాతం మంది పూర్తిస్థాయి ఉద్యోగులు కాగా… 20 శాతం మంది కాంట్రాక్ట్ ఎంప్లాయిస్. వీరిలో 3.7 శాతానికి సమానమైన 7 వేల మందిని ఇంటికి సాగనంపనుంది… డిస్నీ. కంపెనీ సీఈఓగా బాబ్‌ ఐగర్‌ తిరిగి బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకున్న కీలక నిర్ణయమిది.

అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను ప్రకటించిన వెంటనే… ఉద్యోగుల తొలగింపు ప్రకటన కూడా చేసింది… డిస్నీ. స్ట్రీమింగ్‌ సేవల సబ్‌స్క్రైబర్లు తొలిసారి తగ్గిపోయారని… అక్టోబర్-డిసెంబర్ మధ్య మూడు నెలల వ్యవధిలో డిస్నీ+ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 1 శాతం తగ్గి… 16 కోట్ల 81 లక్షల మందికి చేరిందని డిస్నీ తెలిపింది. అయితే, విశ్లేషకులు అంచనా వేసిన దానికంటే… 1.279 బిలియన్ డాలర్లు, అంటే మన కరెన్సీలో దాదాపు రూ.10,600 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది… డిస్నీ.


ఉద్యోగుల తొలగింపుతో పాటు భారీ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికను కూడా ప్రకటించింది… డిస్నీ. కంపెనీని మూడు విభాగాలుగా విభజించబోతున్నామని చెప్పింది. సినిమాలు, టీవీ, స్ట్రీమింగ్‌ను ఎంటర్‌టైన్‌మెంట్‌ యూనిట్‌ కింది తీసుకొస్తామని వెల్లడించింది. క్రీడలకు సంబంధించిన ఈఎస్‌పీఎన్‌ నెట్‌వర్క్‌ను ప్రత్యేక యూనిట్‌గా చేస్తామని… డిస్నీ పార్క్‌లు, ఎక్స్‌పీరియెన్స్‌లు, ప్రొడక్ట్‌లను ప్రత్యేక విభాగంగా ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఖర్చులు తగ్గించుకోవడం కోసం ఈ ప్రణాళిక ఉపయోగపడుతుందని డిస్నీ పేర్కొంది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×