Wife and Husband : కలియుగంలో మానవ సంబంధాలన్నీ మనీ సంబంధాలుగా మారిపోయిన రోజులివి. ఉరుకులు, పరుగులు జీవితంలో కుటుంబ విలువలు మారిపోతున్నాయి. ఆధునికయుగంలో మనిషి జీవితం మారిపోయింది. ఇంటి పట్టునుండే మగవాడు, ఉద్యోగాలకు వెళ్లే ఆడవాళ్లు కూడా కనిపిస్తున్నారు . అదేమీ తప్పు కాదు. టెక్నాలిజీ పెరిగాక పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి.
ఇన్నీ వచ్చినా ఇంకా మగాళ్ల పెత్తనం కొనసాగుతోంది. భర్తకు భార్యల సేవలు అక్కడక్కడా కొనసాగుతూనే ఉన్నాయి. భార్యాభర్తలిద్దరూ సమానమే. ఒక్కోసారి అలసిపోయి ఇంటికి వచ్చిన భర్త కాళ్లను నొక్కి నొప్పులు తగ్గిస్తుంది భార్య. కానీ భార్య కాళ్లు నొక్కేవాళ్లు, పట్టేవాళ్లు ఉన్నారు. ఇందులో ఏది కరెక్టో తర్వాత విషయం.
భార్య మాత్రం భర్త కాళ్లు పట్టాలని శాస్త్రం చెబుతోంది. దీని వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి.స్థితి కర్త విష్ణుమూర్తికి శ్రీ మహాలక్ష్మిదేవి అంటే ప్రాణం. అందుకే తిరుమల కొండకు వచ్చే ముందు భక్తులు తిరుచానూరు అమ్మవారినిని దర్శించుకుని తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. అమ్మవారిని దర్శించుకుని కొండపైకి వచ్చే భక్తులంటే శ్రీవారికి ఇష్టం.
అలాంటి శ్రీలక్ష్మి కూడా మహావిష్ణువు కాళ్లను ఎందుకు ఒత్తిందని ప్రశ్నించే వారి సంఖ్యకు లెక్కే లేదు. మహా విష్ణువు కాళ్లను లక్ష్మీదేవి వత్తడం వెనుక ఒక రహస్యం ఉంది.
పురుషుల మోకాలి నుంచి పాదాల వరకు శనీశ్వరుడు నివాసం ఉంటాడట. అలాగే మహిళల మోచేతి నుంచి చేతి వేళ్ల వరకు శుక్రుడు నివాసం చేస్తాడట. అలా మహిళలు తమ చేతులతో భర్త కాళ్లను వత్తడం ద్వారా శనీశ్వరుడిపై ఒత్తిడి పడుతుందట. శుక్రుడు ఒత్తిడి శనిపై పడితే అష్టైశ్వర్యాలు లభిస్తాయని విశ్వాసం. అందుకే శ్రీలక్ష్మి శ్రీపతి కాళ్లను వైకుంఠంలో వత్తుతూ ఉంటుందట. అలా చేయడం ద్వారా లక్ష్మీదేవి సిరులకు అధిపతిగా మారిందని విశ్వాసం.