BigTV English
Advertisement

FIFA World Cup : మెస్సీ మెరుపులు.. ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫైనల్‌కు అర్జెంటీనా..

FIFA World Cup : మెస్సీ మెరుపులు.. ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫైనల్‌కు అర్జెంటీనా..

FIFA World Cup : ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచ కప్ లో అర్జెంటీనా అదరగొడుతోంది. సూపర్ ఫామ్ లో ఉన్న ఆ జట్టు ఫైనల్ లోకి దూసుకెళ్లింది. క్రొయేషియాతో జరిగిన మ్యాచ్ లో అర్జెంటీనా స్టార్ మెస్సీ చెలరేగిపోయాడు. మెస్సీ మెరుపులతో సెమీ ఫైనల్ లో క్రొయేషియాను అర్జెంటీనా చిత్తు చేసింది. మంగళవారం అర్ధరాతి జరిగిన తొలి సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో అర్జెంటీనా 3-0 గోల్స్‌ తేడాతో క్రొయేషియాను ఓడించింది. దీంతో అర్జెంటీనా 8 ఏళ్ల తర్వాత ఫైనల్ లోకి ప్రవేశించింది. చివరిసారిగా ఆ జట్టు 2014 లో ఫైనల్‌లో అడుగుపెట్టింది.


ఈ మ్యాచ్‌లో ఆది నుంచి అర్జెంటీనా ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి అర్ధభాగంలో రెండు గోల్స్‌ చేసి మ్యాచ్ పై పట్టు సాధించింది. స్టార్ ఆటగాడు మెస్సీ పెనాల్టీ కిక్‌ ద్వారా 34వ నిమిషంలో తొలి గోల్‌ చేశాడు. ఆ తర్వాత అల్వారెజ్‌ 38 నిమిషంలో మరో గోల్‌ చేశాడు. దీంతో ఆ జట్టు తొలి అర్ధభాగంలో 2-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది. రెండో అర్ధభాగంలో అర్జెంటీనా అదే దూకుడును ప్రదర్శించింది. అల్వారాజ్‌ 69వ నిమిషంలో మరో గోల్‌ కొట్టాడు. దీంతో 3-0 గోల్స్‌ తేడాతో క్రొయేషియాపై విజయం సాధించింది అర్జెంటీనా.

మెస్సీ తొలి గోల్ కొట్టి జట్టులో ఉత్సాహం నింపాడు. దీంతో అర్జెంటీనా ఆటగాళ్లు రెట్టించిన ఉత్సాహంతో మైదానంలో కదంతొక్కారు. క్రొయేషియాకు గోల్ గొట్టేందుకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. దీంతో ఆ జట్టు సెమీస్ లో ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. అర్జెంటీనా దూకుడు ముందు నిలవలేక సెమీస్ నుంచి క్రోయేషియా నిష్క్రమించింది.


బుధవారం అర్ధరాత్రి జరిగే రెండో సెమీ ఫైనల్ లో మొరాకో, ఫ్రాన్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టుతో డిసెంబర్ 18న అర్జెంటీనా ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది.

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×