BigTV English

Aishwarya -Abhishek: వారి పై రూ. 4 కోట్ల పరువు నష్టం దావా వేసిన ఐశ్వర్య దంపతులు..ఇదే కారణమా?

Aishwarya -Abhishek: వారి పై రూ. 4 కోట్ల పరువు నష్టం దావా వేసిన ఐశ్వర్య దంపతులు..ఇదే కారణమా?

Aishwarya -Abhishek: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీ కపుల్స్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటి ఐశ్వర్య రాయ్(Aishwarya Rai), అభిషేక్ బచ్చన్ (Abhisek Bachchan)దంపతుల జంట ఒకటి. ఇద్దరు బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారాలుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. అభిషేక్ బచ్చన్ ఇప్పటికి పలు బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండగా ఐశ్వర్య రాయ్ మాత్రం సినిమాలను కాస్త తగ్గించారని చెప్పాలి. ఇక ఈ దంపతుల గురించి నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వినపడుతూనే ఉంటుంది. అయితే తాజాగా ఈ దంపతులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.


ఏఐతో ఐశ్వర్యరాయ్ ఫోటోలు..

ఐశ్వర్య దంపతులు ఢిల్లీ హైకోర్టుకు వెళ్లడానికి కారణం లేకపోలేదు. ఇటీవల కాలంలో సెలబ్రిటీలు వారి అనుమతి లేకుండా ఫోటోలు వారికి సంబంధించిన విషయాలను తమ స్వలాభం కోసం ఉపయోగిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఐశ్వర్య దంపతులు కూడా యూట్యూబ్(Youtube) పై ఏకంగా రూ. 4 కోట్ల పరువు రాష్టం దావా వేసినట్టు తెలుస్తుంది. ఐశ్వర్య అనుమతి లేకుండా ఫోటోలు వీడియోలు ఉపయోగించకూడదని కోర్ట్ అనుమతి ఇచ్చినప్పటికీ , ఏఐతో క్రియేట్ చేసిన ఐశ్వర్య ఫోటోలు యూట్యూబ్ లో దర్శనం ఇవ్వడంతో ఈమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇలా తన అనుమతి లేకుండా తన ఫోటోలను వాడటంతో తన పరువు ప్రతిష్టలకు పూర్తిగా భంగం కలిగించినట్లేనని కోర్టు తీర్పును ఇచ్చింది.

వెంటనే వాటిని తొలగించాలి..

ఐశ్వర్య వేసిన ఈ పిటిషన్ విచారణ జరిపిన ఢిల్లీ కోర్టు పూర్తిగా ఐశ్వర్యకు అనుకూలంగా తీర్పును వెల్లడించారు. వెంటనే ఐశ్వర్యకు సంబంధించిన యుఆర్ఎల్ లను తొలగించి వాటిని బ్లాక్ చేయాలని యూట్యూబ్ తో పాటు, ఈ కామర్స్ వెబ్ సైట్లకు ఆదేశాలను జారీ చేసింది. అయితే ఎవరికైతే నోటీసులు అందుతాయో వారందరూ 72 గంటలలోపు వాటిని తొలగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఒక యూట్యూబ్ ఛానల్ మాత్రం కోర్టు ఆదేశాలను ధిక్కరించడంతో ఈమె ఆ యూట్యూబ్ ఛానల్ పై పరువు నష్టం కేసు వేసింది.


విడాకుల వార్తలపై ఆగ్రహం..

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వార్త బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చర్చలకు కారణమైంది. అయితే గతంలో కూడా ఐశ్వర్య సోషల్ మీడియాలో తన గురించి వస్తున్న వార్తలను ఈ విధంగానే ఖండిస్తూ వచ్చారు. అదేవిధంగా ఈమె సోషల్ మీడియాకి కూడా చాలా దూరంగా ఉంటారని చెప్పాలి. సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా కనిపించని నేపథ్యంలో ఈమె వైవాహిక జీవితం గురించి కూడా ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేశాయి. ముఖ్యంగా ఐశ్వర్య అభిషేక్ ఇద్దరు విడాకులు తీసుకొని విడిపోతున్నారు అంటూ వార్తలు ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. ఇలా విడాకులు వార్తలు వచ్చిన ప్రతిసారి సోషల్ మీడియా పై అభిషేక్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ వార్తలను ఖండిస్తూ వచ్చారు. ఇలా తమ విడాకుల గురించి వచ్చే వార్తలలో నిజం లేదని, ఈ జంట వైవాహిక జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్నారని చెప్పాలి.

Also Read: Alia Bhatt: ప్రతినెల కూతురి కోసం ఆ పని చేస్తున్న అలియా.. నిజంగా క్యూట్ అబ్బా!

Related News

Akshay Kumar: నా కూతురిని అలాంటి ఫొటోలు పంపమని అడిగాడు.. పోలీసులను ఆశ్రయించిన అక్షయ్ కుమార్

Alai Balai-2025: మనసు ఉప్పొంగుతోంది.. ఇదే మొదటిసారి అంటున్న నాగ్!

Rishabh shetty: ప్లీజ్ థియేటర్ లో ఆ పని చేయొద్దు… ప్రేక్షకులను రిక్వెస్ట్ చేసిన రిషబ్ శెట్టి!

Indian Movie’s: ఇండియన్ చిత్రాల థియేటర్లపై దాడులు.. కక్ష సాధింపు చర్యలేనా?

Alia Bhatt: ప్రతినెల కూతురి కోసం ఆ పని చేస్తున్న అలియా.. నిజంగా క్యూట్ అబ్బా!

Ravi teja: భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటున్న రవితేజ..సంక్రాంతి బరిలో మాస్ హీరో?

Film industry: నాలుగో పెళ్లికి సిద్ధమైన స్టార్ హీరో.. ఏకంగా అంతరిక్షంలో పెళ్లి!

Big Stories

×