BigTV English

Alia Bhatt: ప్రతినెల కూతురి కోసం ఆ పని చేస్తున్న అలియా.. నిజంగా క్యూట్ అబ్బా!

Alia Bhatt: ప్రతినెల కూతురి కోసం ఆ పని చేస్తున్న అలియా.. నిజంగా క్యూట్ అబ్బా!

Alia Bhatt: అలియా భట్ (Alia Bhatt)పరిచయం అవసరం లేని పేరు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తన నటనతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇదివరకు ఈమె నటించిన సినిమాలు కేవలం బాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమయ్యాయి కానీ ఇటీవల పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంటున్నాయి. ఇక తెలుగులో కూడా అలియా భట్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ నటించిన RRR సినిమాలో సీత పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.


రణబీర్ కపూర్ తో ప్రేమ వివాహం..

ఈ సినిమా తరువాత నుంచి అలియా నటిస్తున్న ప్రతి ఒక్క సినిమా తెలుగులో కూడా విడుదలవుతూ మంచి విజయాన్ని అందుకుంటుంది. ఇదిలా ఉండగా తాజాగా ఆలియా భట్ కి సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది. ఈమె ప్రముఖ బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్(Ranbir Kapoor) లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు రాహా(Raaha) అనే ఒక కుమార్తె కూడా ఉంది. నిత్యం తన కుమార్తెకు సంబంధించిన అన్ని విషయాలను ఆలియా దంపతులు అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా అలియా భట్ తన కుమార్తెకు ఒక బిగ్ సర్ప్రైజ్ సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.

కూతురి కోసం ప్రతి నెల మెయిల్..

అలియా భట్ కూతురు పుట్టినప్పటినుంచి తన కోసం ప్రతినెల ఒక మెయిల్ రాస్తూ ఉన్నారట. ఆ నెలలో రాహ చేసిన అల్లరి, చిలిపి పనులను ప్రస్తావించడం అలాగే పాప ఫోటోలతో పాటు చిన్న చిన్న కొటేషన్లతో ప్రతి నెల ఒక మెయిల్ రాస్తారని తెలుస్తోంది. తన కుమార్తెకు 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత వీటన్నింటిని తనకు సర్ప్రైజ్ గా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్టు ఈమె వెల్లడించారు. అందుకే ఇప్పటినుంచి తన కూతురుకు సంబంధించిన అన్ని విషయాలను ప్రతినెల మెయిల్ రూపంలో భద్రపరుస్తున్నట్టు వెల్లడించారు. ఇలా కూతురి కోసం ఆలియా చేస్తున్న ఈ పని తెలిసి అందరూ ఆశ్చర్యపోవడమే కాకుండా నిజంగా ఇది క్యూట్ సర్ప్రైజ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక అలియా భట్ రణబీర్ దంపతులు 2022 ఏప్రిల్ 14వ తేదీ ముంబైలో వివాహం జరుపుకున్నారు. 2022 నవంబర్ లో వీరికి రాహా జన్మించారు.


పాన్ ఇండియా హీరోయిన్ గా అలియా..

ఇక అలియా భట్ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె ఆల్ఫా అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు బ్రహ్మాస్త్ర 2 కూడా త్వరలోనే చేయబోతున్నారు. అయితే ఈ సినిమా మొదటి భాగంలో తన భర్త రణబీర్ కపూర్ తో కలిసిన నటించారు. ప్రస్తుతం రణబీర్ కపూర్ రామాయణ షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాతనే బ్రహ్మాస్త్ర 2 కూడా ప్రారంభం కానుందని తెలుస్తుంది.

Also Read: Ravi teja: భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటున్న రవితేజ..సంక్రాంతి బరిలో మాస్ హీరో?

Related News

Rishabh shetty: ప్లీజ్ థియేటర్ లో ఆ పని చేయొద్దు… ప్రేక్షకులను రిక్వెస్ట్ చేసిన రిషబ్ శెట్టి!

Indian Movie’s: ఇండియన్ చిత్రాల థియేటర్లపై దాడులు.. కక్ష సాధింపు చర్యలేనా?

Aishwarya -Abhishek: వారి పై రూ. 4 కోట్ల పరువు నష్టం దావా వేసిన ఐశ్వర్య దంపతులు..ఇదే కారణమా?

Ravi teja: భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటున్న రవితేజ..సంక్రాంతి బరిలో మాస్ హీరో?

Film industry: నాలుగో పెళ్లికి సిద్ధమైన స్టార్ హీరో.. ఏకంగా అంతరిక్షంలో పెళ్లి!

Actress Kajol: నటి కాజోల్ కి ఘోర అవమానం.. పబ్లిక్ లో ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ!

Kantara Chapter 1: కాంతార 2 ఫస్ట్ డే కలెక్షన్స్..ఆ సినిమాలన్నీ వెనక్కే?

Big Stories

×