E-Paper
Advertisement

Vitamin C : జలుబు తగ్గడంలో సీ విటమిన్‌ పాత్ర ఉందా?

Vitamin C : జలుబు తగ్గడంలో సీ విటమిన్‌ పాత్ర ఉందా?
Advertisement

Vitamin C : ఎక్కువగా జలుబుతో ఇబ్బంది పడేవారు విటమిన్‌ సి టాబ్లెట్స్‌ వేసుకుంటుంటారు. ఇవి జలుబు వైరస్‌లను కట్టడి చేస్తాయని అనుకుంటారు. కానీ విటమిన్‌ సి రోగనిరోధకశక్తిని పెంచుతున్నది నిజమే. నీటిలో కరిగే విటమిన్ల రకానికి చెందిన ఇది మంచి యాంటీఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తుంది. అంతమాత్రాన జలుబు వైరస్‌లను తగ్గిస్తుందని అనుకోవడానికి వీల్లేదు. ఈ వైరస్‌లపై సమర్థవంతంగా పనిచేయడంలో, జలుబును తక్కువ చేయడంలో దీని ప్రభావం అంతంతేనని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజుకు 200 మిల్లీగ్రాములు అంతకంటే ఎక్కువ మోతాదులో విటమిన్‌ సి తీసుకోవడం వల్ల జలుబు బారినపడటం, తీవ్రత, వేధించే కాలం తగ్గుతాయా అనేది గుర్తించడానికి గతంలో పెద్ద అధ్యయనమే చేశారు. 60 ఏళ్ల వైద్య పరిశోధనను సమీక్షించిన తర్వాత తేల్చిందేంటంటే జలుబు మొదలయ్యాక విటమిన్‌ సి మాత్రలను మొదలు పెట్టిన వారిలో జలుబు తీవ్రత, ఇది వేధించే సమయంలో ఎలాంటి తేడా లేదని తేలింది. రోజూ విటమిన్‌ మాత్రలు వేసుకున్నవారిలో జలుబు వేధించే సమయం కాస్త తగ్గుతున్నట్టు బయటపడింది. విటమిన్‌ సి మాత్రలు కోల్డ్‌ను పూర్తిగా నివారించలేకపోయినా కొందరిలో లక్షణాల తీవ్రత కొద్దిగా తగ్గినట్టు గుర్తించారు. ఎక్కువ దూరాలు పరుగెత్తే క్రీడాకారులలో మాత్రం రోజూ విటమిన్‌ సి మాత్రలు వేసుకుంటే జలుబు వచ్చే అవకాశం సగం వరకు తగ్గుతుండటం గమనార్హం. నిజానికి మాత్రల కంటే ఆహారంతో విటమిన్‌ సి లభించేలా చూసుకోవటమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. మనకు రోజుకు 65 మి.గ్రా. నుంచి 100 మి.గ్రా. విటమిన్‌ సి అవసరం. దీని మోతాదు 2,000 మి.గ్రా. కంటే మించితే వికారం, వాంతి, ఛాతిలో మంట, కడుపునొప్పిలాంటి దుష్ప్రభావాలు వస్తాయి.
బత్తాయి, నారింజ, నిమ్మ, ఉసిరి, జామ, టమోటా, క్యాబేజీ, కాలిఫ్లవర్‌, బంగాళాదుంపలో విటమిన్‌ సి బాగా లభిస్తుంది. ఆహారం ద్వారా వచ్చే విటమిన్‌ను మన శరీరం బాగా గ్రహిస్తుంది.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×