Big Stories

Indian Embassy : ఉక్రెయిన్‌లో భారతీయులెవ్వరూ ఉండొద్దు : ఇండియన్ ఎంబసీ వార్నింగ్

Indian Embassy : భారతీయులెవరూ ఉక్రెయిన్‌లో ఉండొద్దని ఇండియన్ ఎంబసీ మరోసారి సూచించింది. ఉక్రెయిన్‌లో అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఏర్పడబోతున్నాయని హెచ్చరికలు జారీ చేసింది. అందుబాటులో ఉన్న రవాణా సదుపాయాలను ఉపయోగించుకుని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లి పోవాలని అధికారులు తెలిపారు. డర్టీ బాంబ్ వినియోగించడానికి ఉక్రెయిన్ ప్రయత్నిస్తోందని రష్యా చేసిన ఆరోపణలతో పరిస్థిలుతు ఉద్రక్తంగా మారాయి. ఇదే అంశంపై ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో కూడా చర్చించనున్నారు.

- Advertisement -

రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం రోజురోజుకూ తీవ్ర మవుతోంది. ఉక్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాలను కైవసం చేసుకున్నట్లు రష్యా ఇప్పటికే ప్రకటించింది. అమెరికా అందించిన యుధ్ద సామాగ్రి సహాయంతో ఉక్రెయన్‌ కూడా వెనక్కి తగ్గడం లేదు. రష్యాలోని క్రిమియా బ్రిడ్జ్‌ను ఉక్రెయిన్ పేల్చివేడంతో అధ్యక్షుడు పుతిన్ కంగుతిన్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌తో యుధ్దం కష్టంగా ఉందని రష్యా కూడా ప్రకటించింది. రానున్న రోజుల్లో ఉక్రెయిన్, రష్యా యుద్ధం ఎక్కడికి దారితీస్తుందో వేచి చూడాల్సిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News