Facts Behind Seeing Thoka chukka : తోకచుక్కలు నవగ్రహాలు మాదిరిగానే సూర్యునిచుట్టూ ప్రదక్షిణలు చేసే ఖగోళ వస్తువులు వృత్తాకార కక్ష్యలో అండ కారంలో ఇవి పరిభ్రమిస్తుంటూ ఉంటాయి. సూర్యుని చుట్టూ తిరగడానికి కొన్నింటికి దశాబ్దాలు పడితే, మరి కొన్నింటికి అనేక శతాబ్దాలు కూడా పడుతుంది.తోకచుక్క సూర్యునికి బహు దూరంగా ఉన్నప్పుడు కనిపించీ కనిపించనంత చిన్న కాంతి బిందువులాగా ఉంటుంది. అప్పుడు దానికి తోక ఉండదు. తలమాత్రమే ఉంటుంది.
పెళ్లి కాని అమ్మాయి చూస్తే మంచి భర్త దొరుకుతాడు. దంపతులు కలిసి చూస్తే లక్ష్మీదేవి అనుగ్రహానికి చిహ్నం. జుట్టు విరబోసుకున్నప్పుడు చూస్తే ఆర్ధిక నష్టం కలుగుతుంది. తోకచుక్క పడుతున్నప్పుడు పుట్టింటి వారిని తలుచుకుంటే త్వరలో మిమ్మల్ని వచ్చి తీసుకెళ్తారని సంకేతం. పిల్లవాడికి అన్నము పెడుతున్నప్పుడు చూస్తే ఆ పిల్లాడు మహారాజు అవుతాడు.
నిజానికి తోకచుక్కలు నక్షత్రాలు కావు. 460 కోట్ల ఏళ్ల క్రితం మన సౌర వ్యవస్థ ఏర్పడినప్పుడు మిగిలిన భాగాలని అంటారు. అవి దుమ్ము, రాళ్లు, మంచుతో కప్పబడి ఉంటాయి. గ్రహాలు, గ్రహశకలాలు మాదరిగానే ఇవి సూర్యుడి చుట్టు తిరుగుతుంటాయి.
తోకచుక్కల్లో బాగా ప్రాచుర్యం లభించింది హేలి తోక చుక్కకు. 76ఏళ్లకి ఒకసారి ఇది సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. అప్పటి వరకు తోకచుక్కలు ఏదో ఒకసారే భూమి వైపు వస్తాయని అనుకునే వారు. ఇది 2వేల సంవత్సరాల నుంచి భూమి దిశగా వస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.చివరి సారిగా 1986లో ఇది మనకు కనిపించింది. మళ్లీ 2061లో కనిపిస్తుంది.