BigTV English

IND VS AUS 1st ODI: టాస్ గెలిచిన ఆసీస్..ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..జ‌ట్ల వివ‌రాలు ఇవే

IND VS AUS 1st ODI:  టాస్ గెలిచిన ఆసీస్..ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..జ‌ట్ల వివ‌రాలు ఇవే
Advertisement

IND VS AUS 1st ODI: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఇవాల్టి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానున్న‌ సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే పెర్త్ వేదికగా ఇవాళ తొలి వన్డే మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే టాస్ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. ఇందులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇవాల్టి మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉన్న నేపథ్యంలో బౌలింగ్ ఎంచుకుంది ఆస్ట్రేలియా. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయాల్సి వస్తోంది. ఇవాళ ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది.


Also Read:  Afg vs Pak: ముగ్గురు క్రికెట‌ర్లు మృతి…పాకిస్థాన్ సిరీస్ ర‌ద్దు చేసుకున్న అప్ఘ‌నిస్తాన్‌..PCBకి రూ.100 కోట్ల న‌ష్టం !

తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ వ‌న్డేల్లోకి ఎంట్రీ

తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అరుదైన రికార్డు సృష్టించాడు. మొన్నటి వరకు టెస్టులు అలాగే టి20 లకు ప్రాతినిధ్యం వహించిన ఈ తెలుగు కుర్రాడు ఇప్పుడు వన్డేల్లోకి కూడా చేశాడు. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య పెర్త్ వేదికగా ప్రారంభమైన వన్డే సిరీస్ లో అరంగేట్రం చేశాడు నితీష్ కుమార్ రెడ్డి. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్ లో చోటు దక్కించుకున్నాడు తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి. దీతో ఆల్ ఫార్మాట్ ప్లేయర్ గా నిలిచాడు. ఈ నేపథ్యంలోనే ఇవాళ వన్డే క్యాప్ ను అందించి జట్టులోకి ఆహ్వానించాడు రోహిత్ శర్మ.


ఇక గత సంవత్సరం నవంబర్ 22వ తేదీన విరాట్ కోహ్లీ నుంచి టెస్ట్ క్యాప్ అందుకున్నాడు నితీష్ కుమార్ రెడ్డి. ఇవి నితీష్ కుమార్ రెడ్డి కెరీర్ లో మర్చిపోలేని మూమెంట్స్ గా మిగిలి పోనున్నాయని క్రికెట్ అభిమానులు చెబుతున్నారు. మరి తన తొలి వన్డేలో నితీష్ కుమార్ రెడ్డి ఎలా ఆడతాడో చూడాలి. ఆల్ రౌండర్ కాబట్టి బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో రాణిస్తేనే, నితీష్ కుమార్ రెడ్డికి టీం ఇండియాలో స్థానం పదిలంగా ఉంటుంది. లేకపోతే ఈ సిరీస్ తర్వాత తీసి అవతల పడేయడం ఖాయం. ఇక అటు ఈ మ్యాచ్ లో రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ ఇద్ద‌రూ చాలా రోజుల త‌ర్వాత వ‌న్డేలు ఆడుతున్నారు. వాళ్ల ఆట‌తీరుపై కూడా అంద‌రి దృష్టి ఉంది.

టీమిండియా వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్లు

ఇండియా (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (కెప్టెన్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, జోష్ ఫిలిప్ (కెప్టెన్), మాట్ రెన్షా, కూపర్ కొన్నోలీ, మిచెల్ ఓవెన్, మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హాజిల్‌వుడ్

 

Tags

Related News

IND vs AUS: RO-KO అంటూ జాకీలు పెట్టి లేపారు..కంగారుల ముందు మాత్రం తోక ముడిచారు !

INDW vs ENGW: ఇవాళ ఇంగ్లండ్ తో డూ ఆర్ డై.. ఓడితే టీమిండియా ఇంటికేనా ?

IND VS AUS 1st ODI: నేడే ఆస్ట్రేలియాతో తొలి వన్డే..వ‌ర్షం ప‌డే ఛాన్స్‌.. టైమింగ్స్‌,ఉచితంగా చూడాలంటే

Colombo Rains: గ‌బ్బులేపుతున్న కొలంబో వ‌ర్షాలు…వ‌ర‌ల్డ్ క‌ప్ లో 4 మ్యాచ్ లు ర‌ద్దు..త‌ల ప‌ట్టుకుంటున్న ఐసీసీ

Womens World Cup 2025: పాక్ కొంప‌ముంచిన వ‌ర్షం..ద‌క్షిణాఫ్రికా క్వాలిఫై, టీమిండియా సెమీస్ కు వెళ్లే మార్గాలు ఇవే

Dhaka Airport Fire: బంగ్లాదేశ్‌, వెస్టిండీస్ మ్యాచ్ జ‌రుగుతుండ‌గా భారీ అగ్నిప్రమాదం..ఉలిక్కిప‌డ్డ ప్లేయ‌ర్లు

Suryakumar Yadav: గిల్‌ వ‌ల్ల‌ కెప్టెన్సీ కోల్పోతాననే భయం ఉంది..సూర్య సంచ‌ల‌నం !

Big Stories

×