INDW vs ENGW: మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్ లో రెండు జట్లు సెమీ ఫైనల్ కు దూసుకువెళ్లాయి. మరో రెండు స్థానాల కోసం జట్ల మధ్య పోటీ నెలకొంది. ఇలాంటి నేపథ్యంలో ఇవాళ ఇంగ్లాండ్ వర్సెస్ టీమిండియా జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు షెడ్యూల్ ఇప్పటికే ఫైనల్ అయింది.
మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఇండోర్ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఎప్పటిలాగే మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. రెండున్నర గంటల ప్రాంతంలో టాస్ ప్రక్రియ ఉంటుంది. జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్ చానల్స్ లో ఈ మ్యాచ్ తిలకించవచ్చు. ఇవాళ జరిగే మ్యాచ్లో రెండు జట్లకు కూడా విజయం చాలా కీలకము.
ఇందులో గెలిచిన జట్టుకు సెమీ ఫైనల్ ఛాన్సులు ఎక్కువగా అవుతాయి. పాయింట్ల పట్టికలో కూడా మూడో స్థానంలో ఇంగ్లాండ్ ఉండగా నాలుగో స్థానంలో టీమిండియా ఉంది. దాదాపు ఈ రెండు జట్లు సెమీ ఫైనల్ కు వెళ్తాయని అంటున్నారు. కానీ ఇవాళ గెలిచిన జట్టుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే… రెండు జట్లకు కూడా సెమీ ఫైనల్ ఛాన్సులు ఏమాత్రం తగ్గబోవు. మిగిలిన నాలుగు జట్లలో కేవలం న్యూజిలాండ్ మాత్రమే పోటీలో ఉంది.
ఒకవేళ టీమిండియా ఈ మ్యాచ్ లో ఓడిపోయిన సరే సెమిస్ ఆశలు ఏ మాత్రం తగ్గవు. ఎలా అంటే, టీమిండియా తన తదుపరి మ్యాచ్ లో న్యూజిలాండ్ అలాగే బంగ్లాదేశ్ తో తలపడాల్సి ఉంటుంది. ఈ రెండు జట్ల మీద టీమిండియా చాలా సులభంగా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే రన్ రేట్ కూడా మెయిన్ టేన్ చేసుకుంటూ వెళ్లాలి. అలా చేస్తే నాలుగవ స్థానంలో ఉన్న టీమిండియాకు సెమీస్ బెర్త్ ఖరారు అవుతుంది.
ఇండియా ప్రాబబుల్ XI: స్మృతి మంధాన, ప్రతికా రావల్, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్ (C), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, స్నేహ్ రాణా, అమంజోత్ కౌర్/క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా ఠాకూర్
ఇంగ్లాండ్ ప్రాబబుల్ XI: టామీ బ్యూమాంట్, అమీ జోన్స్ (వికెట్ కీపర్), హీథర్ నైట్, నాట్ స్కైవర్-బ్రంట్ (C), సోఫియా డంక్లీ, ఎమ్మా లాంబ్, ఆలిస్ కాప్సే, షార్లెట్ డీన్, సోఫీ ఎక్లెస్టోన్, లిన్సే స్మిత్, లారెన్ బెల్