Diwali 2025: ఆనందాల పండగ అయిన దీపావళిని అక్టోబర్ 20న జరుపుకోనున్నాము. ఇది కార్తీక మాసంలోని అమావాస్య రోజున వస్తుంది. పురాణాల ప్రకారం.. శ్రీరాముడు 14 సంవత్సరాల వనవాసం నుంచి అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు, అయోధ్య ప్రజలు దీపాలు వెలిగించి ఆయనకు స్వాగతం పలికారు. అప్పటి నుంచి.. ఈ పండగను దీపావళి, వెలుగుల పండగగా జరుపుకుంటున్నారు. ఇది వెలుగుల పండగ మాత్రమే కాదు. ప్రేమ, ఆనందం, కొత్త ప్రారంభాలకు చిహ్నం కూడా. ఈ రోజు ప్రతి ఒక్కరి జీవితంలోకి కొత్త ఆశ, సానుకూల శక్తి, వెలుగులను తెస్తుందని నమ్ముతారు.
దీపావళి 2025 తేదీ,శుభ సమయం:
ఈ దీపావళికి, పూజకు పవిత్రమైన సమయం సాయంత్రం 7:08 నుంచి 8:18 వరకు ఉంటుంది. నిషిత కాల ముహూర్తం రాత్రి 11:41 నుంచి 12:31 వరకు ఉంటుంది.
దీపావళి ప్రదోష కాలం:
జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం.. దీపావళి నాడు అక్టోబర్ 20, 2025న ప్రదోష కాలం సాయంత్రం 5:36 నుంచి రాత్రి 8:07 వరకు ఉంటుంది. ఇందులో స్థిర లగ్న వృషభ రాశి కూడా ఉంటుంది. ఇది ఉదయం 6:59 నుంచి ఉదయం 8:56 వరకు ఉంటుంది.
పూజా సామాగ్రి:
పూజ కోసం.. లక్ష్మీ దేవి, గణపతుల విగ్రహాలు, తేనె, గంగా జలం, పువ్వులు, పూల మాల, కుంకుమ, పంచామృతం, మిఠాయిలు, పరిమళ ద్రవ్యాలు, వేదిక, ఎర్రటి వస్త్రంతో కలశం. శంఖం, ఆసనం, పళ్ళెం, వెండి నాణెం, తామర పువ్వు, హవన సామగ్రి, మామిడి ఆకులు, ప్రసాదం, బియ్యం, కుంకుమ, అక్షతలు, మట్టి దీపం, తమలపాకులు, కొబ్బరి కాయలు, పత్తి అవసరం అవుతాయి.
పూజా విధి:
2. ఇంటి ప్రధాన ద్వారం వద్ద ముగ్గు వేయండి. తర్వాత గుమ్మానికి తోరణం కట్టండి.
3. ఇప్పుడు లక్ష్మీ పూజ కోసం.. ముందుగా ఒక శుభ్రమైన వేదికపై కొత్త ఎరుపు రంగు వస్త్రాన్ని పరవండి .
4. వేదికపై లక్ష్మీ-గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి చుట్టూ అలంకరించండి.
5. లక్ష్మీ దేవి, గణపతుల విగ్రహాలను అలంకరించండి. ఈ సమయంలో, దేవతకు కండువాను సమర్పించండి.
6. ఇప్పుడు శుభ్రమైన చెంబును నీటితో నింపి విగ్రహాల ముందు ఉంచండి.
7. దేవత పేరును ఉచ్చరిస్తూ తిలకం దిద్దండి.
Also Read: దీపావళి రోజు ఇంటికి ఇవి కొని తెస్తే .. అష్టైశ్వర్యాలు కలుగుతాయ్
8. లక్ష్మీ, గణపతలుకు పూలమాలలు వేసి, అమ్మవారికి తాజా పువ్వులు సమర్పించండి. ఈ సమయంలో తామర పువ్వును సమర్పించడం మర్చిపోవద్దు.
9.ఇప్పుడు ఆహారాన్ని, అక్షతలు, వెండి నాణెం, పండ్లు, అన్ని స్వీట్లను సమర్పించండి.
10. మీరు ఏదైనా వస్తువు లేదా బంగారం లేదా వెండి కొనుగోలు చేసి ఉంటే.. దానిని లక్ష్మీ దేవి దగ్గర ఉంచండి.
11. స్వచ్ఛమైన దేశీ నెయ్యితో దీపం వెలిగించి, దానితో పాటు ఇంటి మూలలో ఉంచడానికి కనీసం 21 దీపాలను వెలిగించండి.
12. ఇప్పుడు గణపతికి చాలీసా చదవండి.
13. లక్ష్మీ దేవి హారతి, మంత్రాలను జపించండి.
14. ఇప్పుడు ఇంటి అన్ని మూలల్లో దీపాలను ఉంచండి. అమ్మవారి పూజలో ఉపయోగించే పువ్వులను భద్రంగా ఉంచండి.
15. చివరగా, ఆనందం, శ్రేయస్సును కోరుకుంటూ.. పూజా సమయంలో జరిగిన ఏవైనా తప్పులకు క్షమాపణ అడగండి.