BigTV English

Diwali 2025 Upay: దీపావళి రోజు ఈ ఒక్కటి చేస్తే.. ఏడాదంతా సంపదకు లోటుండదు !

Diwali 2025 Upay: దీపావళి రోజు ఈ ఒక్కటి చేస్తే.. ఏడాదంతా సంపదకు లోటుండదు !
Advertisement

Diwali 2025 Upay: దీపావళి హిందుల అత్యంత అత్యంత పవిత్రమైన, ముఖ్యమైన పండగలలో ఒకటి. ఇది చీకటిపై కాంతి విజయాన్ని అంతే కాకుండా ప్రతికూలతపై సానుకూలతను సూచిస్తుంది. పురాణాల ప్రకారం.. లక్ష్మీదేవి ఈ రోజు రాత్రి తన భక్తుల ఇళ్లను సందర్శించి సంపద, అదృష్టం, శ్రేయస్సును ప్రసాదిస్తుంది. ఇదిలా ఉంటే దీపావళి రోజున కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేస్తే.. లక్ష్మీదేవి ప్రత్యేకంగా సంతోషించి అపారమైన శ్రేయస్సును ప్రసాదిస్తుందని చెబుతారు.


దీపావళి రోజున ఎలా దీపం వెలిగించాలి ?
సంప్రదాయం ప్రకారం.. దీపాన్ని నేరుగా నేలపై ఉంచకూడదు. దీపం కింద ఏదైనా పవిత్ర వస్తువును ఉంచితే.. లక్ష్మీదేవి ఆశీస్సులు త్వరగా లభిస్తాయని నమ్ముతారు. అలా చేయడం ద్వారా.. ఇంట్లో ఆనందం, శాంతి, విజయం, శ్రేయస్సు నివసిస్తాయని చెబుతారు.

దీపాలను ఉంచడానికి నియమాలు:
సనాతన ధర్మంలో.. మండుతున్న దీపం అగ్ని దేవుడిని సూచిస్తుంది. ఏ దేవతనైనా గౌరవంగా ఎత్తైన పీఠంపై ఉంచినట్లే.. దీపాన్ని కూడా గౌరవంగా ఉంచాలి. దీపం కింద బియ్యం, పసుపు లేదా ధాన్యాలు వంటి శుభ ప్రదమైన వస్తువులను ఉంచడం శుభప్రదంగా పరిగణిస్తారు.


అక్షతలు:
హిందూ ఆచారాలలో.. బియ్యాన్ని పరిపూర్ణత, స్వచ్ఛత, శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు. ప్రతి పూజలో దీని ఉపయోగం చాలా అవసరం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, బియ్యం సంపద, శ్రేయస్సు యొక్క గ్రహం అయిన శుక్ర గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. దీపం కింద కొద్దిగా బియ్యాన్ని ఉంచడం వల్ల శుక్రుని సానుకూల ప్రభావం పెరుగుతుంది. అంతే కాకుండా ఇది ఆర్థిక పురోగతి , కుటుంబ ఆనందానికి దారితీస్తుంది.

Also Read: దీపావళి రోజు.. లక్ష్మీ దేవిని పూజించే సరైన పద్ధతి ఏంటో తెలుసా ?

పసుపు శుభాన్ని పెంచుతుంది:
పసుపును చాలా పవిత్రంగా భావిస్తారు. దీనిని లక్ష్మీ దేవి నివాసంగా కూడా చెబుతారు. ఇది అదృష్టం, ఆరోగ్యం, శ్రేయస్సును సూచిస్తుంది. పసుపు ముద్దను అమ్మ వారిగా కొలుస్తారు. దీపం వెలిగించే ముందు బియ్యం మీద కొద్దిగా పసుపు చల్లినా కూడా అది ప్రతి కూలతను దూరం చేసి శ్రేయస్సును ఆకర్షిస్తుంది.

నాణెం యొక్క ప్రాముఖ్యత:
సంపదకు ప్రతీక అయిన నాణాలు లక్ష్మీదేవి శాశ్వత ఆశీస్సులను ఇస్తాయని నమ్ముతారు. దీపావళి రాత్రి దీపం కింద రూపాయి లేదా ఏదైనా ఇతర నాణెం ఉంచడం వల్ల డబ్బు స్థిరంగా ఉంటుంది. లోహంతో తయారు చేసిన నాణాలు, బలం స్థిరత్వాన్ని సూచిస్తాయి. పూజ పూర్తయిన తర్వాత.. మీరు డబ్బు నిల్వ ఉంచే స్థలంలో నాణెం ఉంచడం వల్ల ఏడాది పొడవునా ఆర్థిక శ్రేయస్సు లభిస్తుంది.

Also Read: దీపావళి రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి ? ఏ నూనెతో వెలిగిస్తే మంచిది ?

Related News

Diwali 2025: దీపావళికి కొత్త వస్తువులు కొనొచ్చా ? ఈ రోజు పొరపాటున చేయకూడని పనులివే !

Dhanteras 2025: ధన త్రయోదశి నాడు ఈ సమయంలో బంగారం కొంటే.. కుబేరులవుతారు

Diwali 2025: దీపావళి రోజు.. లక్ష్మీ దేవిని పూజించే సరైన పద్ధతి ఏంటో తెలుసా ?

Diwali 2025: దీపావళి రోజు ఇంటికి ఇవి కొని తెస్తే .. అష్టైశ్వర్యాలు కలుగుతాయ్

Wakeup at Night: రాత్రి ఆ సమయంలో నిద్రలేస్తున్నారా.. దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం మీకు తెలుసా?

Diwali 2025: దీపావళి రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి ? ఏ నూనెతో వెలిగిస్తే మంచిది ?

Diwali: భార్య చేసే ఈ ఒక్క ట్రిక్ తో భర్త సుడి తిరగడం ఖాయం.. ఏంటీ ఆ రహస్యం

Big Stories

×