Intinti Ramayanam Today Episode October 19th : నిన్నటి ఎపిసోడ్ లో.. రాజేంద్రప్రసాద్ కుటుంబం ఓ ఇంటిని చూసుకొని అక్కడ ఉండాలని అనుకుంటారు.. ఆ ఇంటిని చూసి అవని బాగానే ఉంది మావయ్య మనం ఇక్కడే ఉన్నాము అని అంటుంది. అవని ఇంటి డబ్బులు కట్టడానికి చాలా కష్టపడుతుంది అని రాజేంద్రప్రసాద్ అనుకుంటూ ఉంటాడు. పార్వతి రాజేంద్రప్రసాద్ కి ఒక గది చూపించి మీరిద్దరూ ఇక్కడ ఉండండి అనేసి అంటుంది. దానికి ఇంత పెద్ద గది మాకెందుకమ్మా అని పార్వతి అంటుంది. ఇంటిని గడపడానికి ఎలా అని ఆలోచిస్తున్నాను అవని నువ్వు గనుక లేకపోతే ఆ డబ్బులు కూడా ఉండేవి కాదు కదా అని రాజేంద్రప్రసాద్ అంటాడు. అక్షయ్ అవని లేకపోతే కచ్చితంగా ఎవరు ఇంట్లో ఉండేవారు కాదు రోడ్డుపై ఉండేవారు అని ఆలోచిస్తూ ఉంటాడు. అవని కష్టపడి ఉద్యోగం చేసే సంపాదిస్తుంది అంటూ తనపై సాఫ్ట్ కార్నర్ ఏర్పడుతుంది. పల్లవిని తీసుకురావడానికి అవని అక్షయ్ బయలుదేరుతుంటే పల్లవి వస్తుంది. కమల్కు విడాకుల నోటీస్ తీసుకొని వస్తుంది. కానీ అందరూ చెప్పడంతో పల్లవి కమల్ తో కలిసి ఉండడానికి ఒప్పుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ప్రోమో విషయానికి వస్తే.. బయట నిల్చున్న పల్లవి కమల్ అన్న మాటలను వింటుంది. భార్య మీద ప్రేమ ఉన్నోడు ఎవడు ఇలా మాట్లాడడు.. నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే నీ దృష్టిలో నేను ఏంటో అర్థం అయిపోయింది. అందుకే నువ్వు నన్ను ఇంట్లోకి రానివ్వడం కాదు. నేనే నీకు ఒక సర్ప్రైజ్ ఇద్దామని వచ్చానని పల్లవి అంటుంది. పల్లవి ఇచ్చిన డివోర్స్ నోటీస్ చూసి కమల్ షాక్ అవుతాడు.. అవని ఆ నోటీసులు తీసుకొని నువ్వు కమల్ కి విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నావా? కొంచమైనా మతి ఉండి ఆలోచించు అని అందరూ పల్లవిని అంటారు. పల్లవిని అందరూ తలా ఒక మాట అంటారు. తొందరపడి జీవితాలని నాశనం చేసుకోవద్దు అని సలహా ఇస్తారు.
ఎన్ని మోసాలు చేసినా అవనీని ఇంట్లో ఉంచుకున్నారు కానీ నన్ను మాత్రం బయటికి గెంటేశారు. ఇది నాకు చాలా అవమానంగా అనిపించింది అని పల్లవి కావాలనే పదేపదే అవనీని ఇరికించాలని అనుకుంటుంది. మొత్తానికి అందరూ చెప్పడంతో కన్విన్స్ అయినట్టు నాటకం ఆడుతుంది. ఇక తాన అనుకున్న ప్లాన్ ప్రకారం ఇంట్లోకి అడుగు పెట్టేస్తుంది. అవని అక్కకి నేను ఇంట్లో ఉండడం ఇష్టం లేదనుకుంటా అందుకే నాతో మాట్లాడటం లేదు ఆమె నా గురించి ఏది చెప్పడం లేదు కదా అని పల్లవి అంటుంది. అవని నేను తీసుకురావడానికి ముందు బయలుదేరింది. మామయ్య ఆరోగ్యం కోసం నేను అన్ని వదిలేసి మంచిగా అందరూ ఉండాలని అనుకుంటున్నాను అని అవని అంటుంది. మొత్తానికైతే పల్లవి అనుకున్న ప్లాన్ ప్రకారం ఇంట్లో సెటిల్ అవుతుంది.
అక్షయ్ శ్రీయ శ్రీకర్ దగ్గరికి వెళ్తాడు. నాన్నగారి ఆరోగ్యం బాగాలేదని మీకు తెలుసు. ఈ రోజుల్లో కూడా ఆయన అందరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. మీరు కూడా అక్కడే ఉంటే నాన్న చాలా సంతోషిస్తారు అని అక్షయ్ అంటాడు. అక్కడికి రావడానికి మాకు ఏమీ అభ్యంతరం లేదు బావగారు. కానీ మాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి అన్ని చంపుకొని అయితే మేము బతకలేం కదా అని శ్రీయా అంటుంది. మాకు నచ్చినట్లు మేముంటాం మమ్మల్ని ఎవరు ఎదిరించే ప్రయత్నం చేయొద్దు అని కండిషన్ పెడుతుంది. మా నాన్నగారి ప్లేస్ లో మీ నాన్న ఉంటే అలానే చేస్తావా అని అక్షయ్ అనగానే శ్రీయ మౌనంగా ఉండిపోతుంది.
మీరు ఇంతగా చెబుతున్నారు కాబట్టి మా కండిషన్స్ కూడా ఒప్పుకున్నారు. కాబట్టి మేము వస్తాము అనే శ్రియా శ్రీకర్ అంటారు.. అక్షయ్ వాళ్ళ నాన్నకి ఇచ్చిన మాట ప్రకారమే.. శ్రీయా, శ్రీకర్ లను ఇంటికి తీసుకొని వస్తాడు. అందరినీ సంతోషంగా పిలుస్తాడు. వీళ్ళిద్దరూ రావడం చూసినా కుటుంబ సభ్యులు చాలా సంతోషపడతారు. అవని మీరిద్దరు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది రండి మీకు గది చూపిస్తాను అని శ్రీయా చెయ్యి పట్టుకుంటుంది. నువ్వు నా చేయి పట్టుకుంటావ్ ఏంటి వదులు బావగారు కండిషన్స్ ఒప్పుకోవడం తోనే మేము ఇక్కడ కొచ్చాము అని శ్రియ అంటుంది.
Also Read : ప్రభావతి ఇంట దీపావళి సంబరాలు.. రోహిణికి దినేష్ వార్నింగ్..మీనా కిడ్నాప్..
మీకు నచ్చినట్లే ఇక్కడ ఉండండి అని అవని కూడా అనడంతో వాళ్లు ఇంకా రెచ్చిపోతారు. ఇక వంట గదిలో జ్యూస్ తాగుతున్న పల్లవి దగ్గరికి వెళుతుంది శ్రీయ. నిన్ను ఇంట్లోంచి మెడ పట్టుకొని బయటికి గెంటేశారు కదా మళ్లీ వచ్చావ్ ఏంటి అని అడుగుతుంది. నువ్వు ఇంట్లో ఉండనివని వెళ్ళిపోయావు కదా మళ్లీ సిగ్గు లేకుండా ఎలా వచ్చావు అని పల్లవి కూడా ఏ మాత్రం తగ్గకుండా బూతులతో రెచ్చిపోతుంది. నేను ఇక్కడికి రావడానికి ఒక ప్లాన్ ఉంది అందుకే వచ్చాను అని శ్రేయ అంటుంది. మొత్తానికి మళ్లీ ఇద్దరూ ఒక గుడ్ కి చేరినట్లు కనిపిస్తుంది అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..