E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today october 19th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరుకు షాక్‌ ఇచ్చిన యముడు  

Nindu Noorella Saavasam Serial Today october 19th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరుకు షాక్‌ ఇచ్చిన యముడు  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: అసత్యం చెప్పి నిన్ను పైకి రప్పించాము నీకు మరు జన్మ లేదు.. అని యముడు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఓంటరిగా కూర్చుని ఏడుస్తుంది ఆరు. మరోవైపు ఆరు కోపం గుప్త వెతుకుతుంటాడు. ఆరు ఓంటరిగా కూర్చుని ఉండటం చూసి దగ్గరకు వెళ్లి బాలిక నువ్వు ఇచ్చట ఉంటివా.? నీకోసం నేను యమలోకం మొత్తం వెతుకుతున్నాను అని చెప్పగానే.. మళ్లీ పుట్టడానికి మా లోకానికి వెళ్లలేనప్పనుడు మీ లోకంలో నేను ఎక్కడ ఉంటే ఏంటి గుప్త గారు అని ప్రశ్నిస్తుంది ఆరు. దీంతో గుప్త బాధగా నీ ఈ పరిస్థితి మాకు ఉపచారం కలిగిస్తుంది బాలిక. మా ప్రభువుల వారు ఇంతలా ఏమార్చెదరు అనుకోలేదు.. అంటాడు గుప్త.

నా తల రాత ఇలా ఉన్నప్పుడు మీరు మాత్రం ఏం చేస్తారు లేండి.. నేను మళ్లీ వెళ్లి నా చెల్లెలుకు కూతురుగా పుడతానని ఎంతో ఆశ పడ్డాను. అదంతా నిరాశ అయింది అని ఆరు భాదపడుతుంది. దీంతో గుప్త కూడా అవును బాలిక నీకు ఆశ పెట్టిన పాపమున మాకును భాగమున్నది.. మమ్ములను క్షమింపుము అంటాడు. దీంతో ఆరు నేను కింద ఉన్నప్పు విధి రాత అదీ ఇదీ అంటూ ఏదేదో చెప్పారు.. ఇప్పుడేమో క్షమించు అంటున్నారు.. ఇది కూడా విధి రాతేనా గుప్త గారు అని అడుగుతుంది. దీంతో గుప్త కాదు బాలిక మా ప్రభువుల వారు ఆడిన నాటకం, ఆయన చేసిన వంచన, మోసం అంటూ గుప్త తిడుతుంటే.. యముడు గట్టిగా విచిత్రగుప్త అనుకుంటూ వస్తాడు. ఆరు గుప్త వెనకాలకు వెళ్లి దాక్కుంటుంది. ఆ బాలిక ఎటుల ఉందో పట్టి తీసుకురమ్ము అని చెప్పగానే.. గుప్త వెనక నుంచి ఆరు సార్‌ అనుకుంటూ ముందుకు వస్తుంది.

Advertisement

నేను ఎక్కడికి వెళ్లలేదు.. ఇక్కడే ఉన్నాను.. అంటుంది. దీంతో యముడు నవ్వుతూ మా అనుమతి లేనిదే నీవు ఎక్కడికి వెళ్లలేవు బాలిక అంటాడు. దీంతో ఆరు కోపంగా పిచ్చిక మీద ‌బ్రహ్మాస్త్రం ఏంటి..? మీరు పెద్ద పెద్ద పాపులను వదిలేసి నా మీద పడ్డారు.. పైగా వ్యగ్యంగా ఆ నవ్వు ఒకటి అంటుంది. దీంతో యముడు బాలిక నీ ఆగ్రహం నాకు అర్థం అయింది. కానీ విధి బలీయమైనది అనగానే.. విధి అని మీరు కూడా మొదలు పెట్టారా..?  చెప్పండి సార్‌ ఇప్పుడు ఆ విధి నన్ను ఏం చేయమని చెప్తుంది.. చెప్పండి  అని అడగ్గానే.. యముడు నువ్వు నీ సోదరి కడుపున పుట్టవలెను అని ఆశపడితివి కదా..? అనగానే.. అది అసాధ్యం అని తమరే ఆర్డర్‌ వేశారు కదా..? మీకు కొంచెం కూడా జాలి దయ ఏమీ లేవా..? అని అడగ్గానే.. నీ మీద జాలి పడి మేము మా ఆజ్ఞను దిక్కరించినా కూడా నువ్వు మళ్లీ జన్మిచండం అసాధ్యం బాలిక అని యముడు చెప్పగానే.. ఆరు షాక్‌ అవుతుంది.

ఇంతలో గుప్త కల్పించుకుని ప్రభు తమరు తలుచుఉకన్నచో అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేయుదురు కదా అని అడగ్గానే.. యముడు కోపంగా విధిని మార్చడం ఆ విధాతకే సాధ్యం.. కానీ విధిని ఏమార్చడం ఈ మానవుల నైజం అనగానే.. ఆరు కోపంగా ఏం మాట్లాడుతున్నారు సార్‌ మా కంటికి కనిపించని విధిని మేము ఎలా వంచన చేస్తాము అని అడుగుతుంది. దీంతో యముడు ఎందుకు చేయలేరు బాలిక ఇన్నాళ్లు నువ్వు విధితో ఆడుకున్నావు.. ఇప్పుడు ఆ ఆట నీ సోదరి ఆడబోవుతున్నది అని యముడు చెప్పగానే.. ఆరు భయంగా అంటే ఇప్పుడు నా చెల్లిని కూడా చంపబోతున్నారా..? అని అడుగుతుంది. లేదు బాలిక నువ్వు నీ సోదరికి కూతురుగా జన్మించాలని కోరుకున్నా… అందుకు మేము అవకాశం ఇచ్చినా నువ్వు మళ్లీ గర్భం నందే మరణించగలవు.. అని యముడు చెప్పగానే.. ఆరు షాక్ అవుతుంది.

Advertisement

ఏమనుచున్నారు ప్రభు ఈ బాలిక మరుజన్మకు పిండ దశలోనే గండమున్నదా..? అని గుప్త అడగ్గానే.. యముడు అవును గుప్త గండమే ఉన్నది అది ఎలాగో మీరే వీక్షించుము అని యముడు చెప్పగానే.. ఆరు, గుప్త భయంగా చూస్తుంటారు ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం !

బిగ్ బాస్ 10లోకి అడుగుపెడుతున్న దేబ్జానీ మోదక్.. ఆమె బ్యాక్ గ్రౌండ్, రెమ్యూనరేషన్ ఎంతంటే?

బిగ్ బాస్ లవర్స్ కి గుడ్ న్యూస్.. టైమింగ్స్ లో భారీ మార్పు!

Gundeninda Gudigantalu Balu : బిగ్ బాస్ లోకి బాలు.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ అంతా..?

Telugu Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి ప్రభావతి కండీషన్.. మీనా, బాలు హ్యాపీ.. ప్రభకు కొత్త టెన్షన్..

Podarillu Today Episode : చక్రీ కి దిమ్మతిరిగే షాక్.. మాధవ్ నిర్ణయంలో మార్పు..? శైలు పై అనుమానం..

Illu Illalu Pillalu Today Episodes: అయ్యో ప్రేమ.. వల్లి మళ్లీ పుల్లేట్టేసింది.. ప్రేమ మారుతుందా..?

Big Stories

Advertisement
×