E-Paper
Advertisement

Sankranti:సంక్రాంతి రోజు ఈ 4 పనులు చేస్తే అన్నీ శుభాలే

Sankranti:సంక్రాంతి రోజు ఈ 4 పనులు చేస్తే అన్నీ శుభాలే

Sankranti:సంక్రాంతి రోజు ఉదయం లేచిన తర్వాత నల్లనువ్వులతో నలుగు పిండి ఒంటికి రాసుకోవాలి. తర్వాత బకెట్ నీళ్లలో నల్లనువ్వులు ఉంచి ఐదు నిమిషాల తర్వాత స్నానం ఆచరించాలి. స్నానం చేసిన తర్వాత పాలలో తెల్లనువ్వులు, కొంచెం పంచదార కలుసుపుకి కుటుంబ సభ్యులంతా తాగితే ఏలినాటి దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

మధ్యాహ్నం భోజనంలో బెల్లంతో కూడిన నువ్వుల పదార్ధాలను స్వీకరిస్తే…. జాతకంలో పితృదోషాలు, పితృశాపాలు తొలగిపోతాయి. పితృదేవతల అనుగ్రహం కలిగి ఏడాదంతా అని రకాలుగా శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే సంక్రాంతి రోజు ఇంట్లో శివలింగం ఉన్న వాళ్లు ఇంటి యజమాని స్వయంగా ఆవు నెయ్యితో అభిషేకం చేయాలి. స్పటిక లింగం తో సహా ఏ లింగం ఉన్నా శివమంత్రాన్ని జపిస్తూ అభిషేకిస్తే….. శివానుగ్రహం కలుగుతుంది. శివు లింగం లేని వాళ్లు శివుడి ఫోటో దగ్గర నువ్వుల దీపంతో దీపారాధాన చేయచ్చని సూచిస్తున్నారు. ఇలా శివుడి దగ్గర నువ్వుల దీపం పెట్టడం, ఆవు నెయితో శివాభిషేకం చేయడం వల్ల సంవత్సరం అంతా శివుడి అనుగ్రహం కలుగుతుందని..సకల శుభాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ నాలుగు పనులు చేయడం వల్ల అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు సిద్ధిస్తాయి.

అలాగే విష్ణుదేవుడ్ని పూజించే వాళ్లు పద్మ పుష్పాలతో పూజిస్తూ విష్ణు సహస్రనామం పటించాలి. ఈ పనిచేయడం వల్ల సంవత్సరమంతా విష్ణుమూర్తి అనుగ్రహం ప్రాపిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. సంక్రాంతి రోజు సూర్యకిరణాలు పడే ప్రాంతంలో పొంగలి తయారు చేసి సూర్య భగవానుడికి, విష్ణుమూర్తికి నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరించాలి. అలాగే గాలి పటాలు ఎగరేసి సూర్యుడ్ని ఉత్తరాయణ పుణ్యకాలానికి ఆహ్వానంపలికితే….శుభఫలితాలు పొందవచ్చని పండితులు చెబుతున్నారు.

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×