BigTV English

God Photo on Main Entrance: ఇంటి గుమ్మంపై ఏ దేవుడి ఫోటో పెట్టుకోవాలి

God Photo on Main Entrance: ఇంటి గుమ్మంపై ఏ దేవుడి ఫోటో పెట్టుకోవాలి

God Photo on Main Entrance: ఇంట్లో సింహద్వారాల దగ్గర కొన్ని దేవుడి ఫోటోలు పెట్టుకుంటే ధన ప్రాప్తి కలుగుతుంది. ధనం నిల్వ ఉంటుంది. ఉన్న డబ్బును పెంచుకునే అవకాశం ఉంటుంది. సింహ ద్వారం దాటి ఇంటి లోపలి నుంటి బయటకి వెళ్తామో అంటే లోపల సింహద్వారానికి పైన అభిముఖంగా ధనరాశులతో కూడిన పద్మాసనంలో కూర్చుని చేతి నుంచి ధనాన్ని కురిపిస్తూ అటు ఇటు ఏనుగులు ఉండే లక్ష్మీదేవి పటాన్ని పెట్టుకోవాలి. ఐశ్వర్య కాళీ లక్ష్మి పాదాలు ఫోటో కూడా పెట్టవచ్చు. లేదంటే గోమాత శక్తి పీఠాలతో ఉన్న ఫోటోను ఉంచుకోవాలి.


ఇంటి లోపలకి చుట్టాలో బంధువులో, స్నేహితులో ఎవరో ఒకరు వచ్చి వెళ్తుంటారు. అలా వచ్చే వాళ్లలో కొంతమంది ఇళ్లలో కనిపించే వస్తువులపైన కూడా మనుషులపై దిష్టి పెడుతుంటారు. అలాంటి వారి వల్ల ఇంటికి నష్టం జరుగుతుంది. ఈ కష్టాలను తప్పించుకోవడానికి ఇలాంటి దేవుడి పటాలు ఉంచాలి యజమాని ఒకరూపాయి బయటకి తీసుకుని వెళ్తే పది పైసలు మిగులుతుంది. గుమ్మం పైన ఉన్న లక్ష్మిదేవికి నమస్కారం పెట్టుకుని బయటకి వెళ్తే మనం ఖర్చుపెట్టే డబ్బులో కొంత మిగులుతుంది. ఎంతో కొంత నిల్వతో ఉంటాం.

మరికొంతమంది గుమ్మం బయట అంటే సింహద్వారం బయట దేవుడి ఫోటోలను పెడుతుంటారు. వాస్తు ప్రకారం అలా పెట్టుకూడదని పండితులు చెబుతున్నారు. గజలక్ష్మి లాంటి ఫోటోలు కూడా పెట్టుకూడదు. శంకు చక్రాలు, నామాలు లాంటి పెట్టుకోవచ్చు. అసలు ఏమీ పెట్టుకోకపోయినా పర్వాలేదు. కొంతమంది ఇంటి లోపల ఎదురుగా లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి పెడుతుంటారు. అలా చేయద్దని పండితులు సూచిస్తున్నారు.


గృహంలో తూర్పు , పడమల గోడలకు దేవుడి పటాలను పెట్టుకోవచ్చు. అలాంటి దిక్కుల్లో పెట్టి పూజించడం వల్ల ఫలితం కలుగుతుంది. మిగిలిన దిక్కుల్లో ఒకవేళ ఫోటోలు పెట్టి పూజ చేసినా ఫలితం ఉండదని సెలవిస్తున్నారు. అవి కేవలం అలంకార ప్రాయమే అవుతాయట.

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×