BigTV English

Corona: చైనా మేడ్ కరోనా వైరస్.. వుహాన్ ల్యాబ్ నుంచే లీక్.. బుక్ కలకలం

Corona: చైనా మేడ్ కరోనా వైరస్.. వుహాన్ ల్యాబ్ నుంచే లీక్.. బుక్ కలకలం

Corona: కరోనా వైరస్. యావత్ ప్రపంచాన్ని వణికించిన వైరస్. అదెలా పుట్టింది? ఎక్కడ పుట్టింది? అనేదానిపై ఇప్పటికీ రచ్చ నడుస్తోంది. చైనానే కరోనాకు పుట్టినిల్లు అనే అనుమానం ఉంది. వుహాన్ ల్యాబ్ నుంచే వైరస్ లీక్ అయిందనే ఆరోపణ ఉంది. ఆ అనుమానాలు, ఆరోపణలు నిజమేనంటూ.. తాజాగా రిలీజ్ అయిన ఓ పుస్తకం స్పష్టం చేసింది. ఆ బుక్ లోని అంశాలపై వాల్డ్ వైడ్ గా చర్చ నడుస్తోంది. ఇంతకీ ఆ పుస్తకంలో ఏముంది? దాన్ని రాసింది ఎవరు?


కరోనా మానవ నిర్మిత వైరసేనంటూ అమెరికాకు చెందిన అంటువ్యాధుల నిపుణుడు (ఎపిడమాలజిస్ట్‌) ఆండ్రూ హఫ్స్‌ వెల్లడించారు. గతంలో ఆయన అమెరికా తరఫున వుహాన్‌ ల్యాబ్‌తో కలిసి పని చేశారు. అలాంటి ఆండ్రూ హఫ్స్ ఇలాంటి సంచలన విషయం వెల్లడించడంతో మరోసారి అందరి దృష్టి చైనా వైపు మళ్లింది. ఆయన రాసిన ‘ది ట్రూత్‌ అబౌట్‌ వుహాన్‌’ పుస్తకం ఇప్పుడు టాక్ ఆఫ్ ది వరల్డ్ అయింది.

వైరస్‌లపై పరిశోధనలు జరిపే క్రమంలో సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్ల.. వుహాన్‌ ల్యాబ్‌ నుంచి వైరస్‌ లీకయ్యిందని ఆండ్రూ హఫ్స్‌ ఆ పుస్తకంలో రాశారు. విదేశీ ల్యాబ్‌లలో బయో సేఫ్టీ, బయో సెక్యూరిటీ, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి అవసరమైన నియంత్రణ చర్యలు లేకపోవడం.. వుహాన్‌ ల్యాబ్‌ నుంచి వైరస్‌ లీకవడానికి దారితీసిందని హఫ్స్ వెల్లడించారు. కొవిడ్‌-19 జన్యుపరంగా తయారు చేసిందేనని చైనాకు మొదటినుంచీ తెలుసన్నారు.


చైనాతో పాటు అమెరికానూ తప్పుబట్టారు ఆండ్రూ హఫ్స్. ప్రమాదకర బయో వెపన్ టెక్నాలజీని అమెరికానే చైనాకు బదిలీ చేస్తోందని తన పుస్తకంలో తప్పుబట్టారు. అంటువ్యాధులపై అధ్యయనం చేసే స్వచ్ఛంద సంస్థ ‘ఎకోహెల్త్‌ అలయన్స్‌’కు ఆండ్రూ హఫ్స్‌ గతంలో ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. అమెరికా ప్రభుత్వం నుంచి నిధులు పొందుతున్న ఈ సంస్థ.. కొవిడ్ కు ముందు చైనాలోని వుహాన్‌ వైరాలజీ ల్యాబ్‌తో కలిసి పనిచేసింది. సో, వుహాన్ ల్యాబ్ గురించి అందరికంటే ఎక్కువ విషయాలే ఆయనకు తెలుసుంటాయి.

కరోనా వైరస్ చైనాలోనే పుట్టి.. ప్రపంచాన్ని చుట్టుముట్టిందనే అనుమానం ఉన్నా.. ఇప్పటి వరకైతే ఎలాంటి ఆధారాలు లేవు. వుహాన్ ల్యాబ్ లో వైరస్ ప్రయోగాల్లో అమెరికాకూ భాగస్వామ్యం ఉండటంతో.. ఆ విషయం అంత ఈజీగా తేలేది కాదు. ఆండ్రూ హఫ్స్ పుస్తకం బాగా అమ్ముడుపోయి ఆయనకు కాసులు కురిపిస్తుందేమో కానీ.. అసలు నిజం మాత్రం ఎన్నటికీ బయటకు రాదంటున్నారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×