E-Paper
Advertisement

FarmHouse Case: సంతోష్, జగ్గుస్వామి.. ఊరట & ఉత్కంఠ..

FarmHouse Case: సంతోష్, జగ్గుస్వామి.. ఊరట & ఉత్కంఠ..
Advertisement

FarmHouse Case: వీక్లీ సీరియల్ గా వాయిదా పడుతోంది కేసు. ఫాంహౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు తీర్పు పదే పదే ఉత్కంఠ రేపుతోంది. కేసులో కీలకంగా మారిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కేరళ ఆయుర్వేద వైద్యుడు జగ్గుస్వామిలకు సిట్ నోటీసులు ఇవ్వడం.. వారు హైకోర్టును ఆశ్రయించడం.. వారి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వాదిస్తుండటం.. సిట్ సైతం సుప్రీం లాయర్ ను రంగంలోకి దింపడం.. ఇలా అత్యంత ఆసక్తికరంగా మారుతోంది ఫాంహౌజ్ కేసు.

బీఎల్ సంతోష్ కు ఇచ్చిన సిట్ నోటీసులపై హైకోర్టు ఇప్పటికే స్టే విధించగా.. తాజాగా మరోసారి పొడిగించింది. బీఎల్ సంతోష్ కు ఇచ్చిన నోటీసులపై స్టే ఎత్తివేయాలని అడ్వకేట్ జనరల్ వాదించారు. అయితే, సంతోష్ నిందితుడు కాకపోయినా 41ఏ సీఆర్‌పీసీ కింద నోటీసు ఇవ్వడాన్ని తప్పుపట్టిన ఆయన తరపు న్యాయవాది తప్పుబట్టారు. 41ఏ కింద నోటీసులు ఇవ్వడం తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉందని, తమ వాదనలు విన్న తర్వాతే కోర్టు నిర్ణయం తీసుకోవాలని వాదించారు.

Advertisement

దీంతో, ఇరువర్గాలు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణ ఈ నెల 13కు వాయిదా వేసింది హైకోర్టు. అప్పటి వరకూ సంతోష్ కు సిట్ ఇచ్చిన నోటీసులపై స్టే కొనసాగుతుందని తెలిపింది.

మరోవైపు, జగ్గుస్వామికి సిట్ నోటీసులపైనా స్టే విధించింది న్యాయస్థానం. ఈ నెల 13 వరకు వారిద్దరిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సిట్ ను ఆదేశించింది హైకోర్టు. వచ్చే వారం తుది తీర్పు వెలువడే అవకాశం ఉండటంతో.. న్యాయస్థానం నిర్ణయం ఎలా ఉండబోతుందనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. సంతోష్ కు సిట్ నోటీసుల నుంచి విముక్తి వస్తుందా? లేదంటే, సిట్ విచారణకే గ్రీన్ సిగ్నల్ లభిస్తుందా?

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

Big Stories

Advertisement
×