BigTV English

Gold Rate Increased: అయ్యబాబోయ్.. బంగారం ధరలు ఒక్కసారిగా ఇంత పెరిగిందేంటి?

Gold Rate Increased: అయ్యబాబోయ్.. బంగారం ధరలు ఒక్కసారిగా ఇంత పెరిగిందేంటి?

Gold Rate Increased: బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. నేను అసలు తగ్గేదేలే అన్నట్టుగా ఉంది ప్రస్తుత బంగారం వ్యవహారం.. శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,03,310 కాగా.. శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,04,950 వద్ద పలుకుతోంది. అలాగే శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.94,700 ఉండగా.. శనివారం రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 96,200 వద్ద ఉంది. అంటే ఒక్కరోజుకు రూ.1,640 పెరిగింది.


పగబట్టిన పసిడి ధరలు..
బంగారం ఇలా రోజు పెరుగుతు పోతే బంగారంపై ఎవ్వరు కన్నేత్తి చూడలన్న బయపడతారు.. ఇప్పటికే లక్ష దాటిన బంగారం ధర.. నాలుగు రోజులైతే లక్షన్నర అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది. పాపం పసిడి ప్రియులు బంగారంపై ఆశా చంపుకోవాల్సిందేమో ఇంకా.. ముఖ్యంగా సామాన్య ప్రజలు అయితే వాటిని కొనాలి అనే ఆశ కూడా చంపుకుంటున్నారు.. మధ్య తరగతి వారు ఇంకా వన్ గ్రాం గోల్డ్ వైపు దారి మల్లించాల్సిందేనా.. అసలు బంగారం ధరలు ఎందుకు ఇంతలా పెరుగుతున్నాయని పసిడి ప్రియులు ప్రశ్నలు వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు ఇంకా పెరుగుతుందా?.. లేదా తగ్గుతుందా? అని ప్రశ్నిస్తున్నారు.

బంగారం పెరుగుటకు అసలు కారణం..
ట్రంప్ విధించిన 50 శాతం సుంకాల వల్ల అంతర్జాతీయ సానుకూల ధోరణికి తోడు రూపాయి బలహీనతతో బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. దీంతో భారతదేశ రూపాయి విలువ మొత్తానికి పడిపోవడంతో బంగారం రేట్లు కూడా రైలులా పరిగెడుతున్నాయి.


రాష్ట్రంలో బంగారు ధరలు..

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,04,950 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 96,200 వద్ద పలుకుతోంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,04,950 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 96,200 వద్ద ఉంది.

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,04,950 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.96,200 వద్ద కొనసాగుతుంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,05,100 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.96,350 వద్ద పలుకుతోంది.

Also Read: నాతో తిరిగి.. నన్నే లేపేస్తార్రా! హత్యకు కుట్రపై కోటంరెడ్డి ప్రెస్ మీట్..

నేటి సిల్వర్ ధరలు ఇలా..
బంగారం ధరలుకు ఏమాత్రం తగ్గుకుండా సిల్వర్ ధరలు కూడా దూసుకెళుతున్నాయి. శుక్రవారం కేజి సిల్వర్ ధర రూ. 1,29,900 కాగా శనివారం కేజి సిల్వర్ ధర రూ.1,31,000 వద్ద పలుకుతోంది. అంటే ఒక్కరోజే సిల్వర్ ధరలు కేజిపై రూ.1100 పెరిగింది. అలాగే కలకత్త, ముంభై, ఢీల్లిలో కేజీ సిల్వర్ ధరలు రూ. 1,21,000 వద్ద కొనసాగుతోంది.

Related News

RBI to Banks: ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఇకపై ఏటీఎంలో ఆ నోట్లు తప్పనిసరి

DMart Offers: డీమార్ట్ రెడీ బంపర్ ఆఫర్.. స్పెషల్ డిస్కౌంట్లు.. ఆఫర్ ఎప్పటి వరకు?

Jio IPO: తగ్గేదే లేదంటున్న జియో.. త్వరలో ఐపీఓ, మెటాతో కలసి AI ఎంట్రీ

YouTube Tips: యూట్యూబ్ ద్వారా కళ్లు చెదిరే ఆదాయం.. సింపుల్ గా ఈ టిప్స్ పాటిస్తే చాలు!

BSNL BiTV: 450కి పైగా టీవీ ఛానెళ్లు, 25 ఓటీటీ సబ్ స్క్రిప్షన్లు.. అన్నీ కలిపి రూ.151 మాత్రమే

Big Stories

×