BigTV English

YouTube Tips: యూట్యూబ్ ద్వారా కళ్లు చెదిరే ఆదాయం.. సింపుల్ గా ఈ టిప్స్ పాటిస్తే చాలు!

YouTube Tips: యూట్యూబ్ ద్వారా కళ్లు చెదిరే ఆదాయం.. సింపుల్ గా ఈ టిప్స్ పాటిస్తే చాలు!

Youtube Money: ఈ రోజుల్లో చాలా మంది సొంతంగా యూట్యూబ్ చానెల్స్ ఓపెన్ చేస్తున్నారు. ఆకట్టుకునే కంటెంట్ అప్ లోడ చేస్తూ మంచి వ్యూస్ సంపాదిస్తున్నారు. ఆదాయం కూడా బాగానే పొందుతున్నారు. కొంత మంది వందలు సంపాదిస్తుంటే, మరికొంత మంది లక్షలు, కోట్లు సంపాదిస్తున్నారు. అయితే, యూట్యూబ్ ద్వారా ఎక్కువ ఆదాయం పొందాలనుకునే వారు కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది. ఇంతకీ అవేంటి? అనేదిఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


⦿ యూట్యూబ్ లో రాణించాలనుకునే వారు, కంటెంట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వీక్షకులకు ఉపయోగకరంగా, వినోదాత్మకంగా, ఆకర్షణీయంగా అనిపించే నాణ్యమైన కంటెంట్‌ క్రియేట్ చేయాలి. వీడియోలను సొంతంగా రూపొందించడంతో పాటు అదనపు హంగులను సృష్టించాలి. కంటెంట్ బాగుంటుంది అనే నమ్మకాన్ని వీక్షకులకు కల్పించాలి.

⦿ వీడియోలు క్రమం తప్పకుండా అప్ లోడ్ చేయాలి. అంతేకాదు, రాబోయే వీడియోల గురించి ప్రస్తుత వీడియోల్లో ప్రస్తావించాలి. అలా చేయడం వల్ల అప్ కమింగ్ వీడియోల పట్ల వీక్షకులలో ఆసక్తి కలుగుతుంది.


⦿ యూట్యూబ్ చానెల్ సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగాలంటే సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ (SEO) కీలక పాత్ర పోషిస్తుంది. టైటిల్స్, వివరణ, ట్యాగ్స్, కీవర్డ్స్ ఆకట్టుకునేలా ఉండాలి. క్రియేటర్స్ తమ వీడియోలు యూట్యూబ్ సెర్చ్ రిజల్ట్స్ లో టాప్ లో ఉండేలా చూసుకోవాలి. ఆకర్షణీయమైన థంబ్‌ నెయిల్స్ కూడా వీక్షకులను ఆకట్టుకునేలా చూసుకోవాలి.

⦿ యూట్యూబ్ వీడియోలను ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ఎక్స్ లాంటి ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లలో షేర్ చేయడం ద్వారా అదనపు ట్రాఫిక్ పెరుగుతుంది.

⦿ వీడియోల లోపల వీక్షకులను లైక్ చేయమని, కామెంట్ చేయమని, సబ్‌ స్క్రైబ్ చేయమని అడగాలి. అలా చేయడం వల్ల లైక్స్, కామెంట్స్, సబ్‌ స్క్రైబర్లు పెరుగుతారు.

⦿ ఒక ఛానెల్ బలమైన సబ్‌ స్క్రైబర్ బేస్‌ ను నిర్మించిన తర్వాత ఆదాయం దానంతట అదే వస్తుంది.  స్పాన్సర్‌ షిప్‌ లు, బ్రాండ్ డీల్స్ డబ్బులు వచ్చేలా చేస్తాయి. యూట్యూబ్ యాడ్‌ సెన్స్ ప్రోగ్రామ్ క్రియేటర్స్ వీడియోల సమయంలో కనిపించే ప్రకటనల నుంచి కూడా ఆదాయాన్ని పొందవచ్చు.

⦿ అంతేకాదు, ఆదాయం మరింత పొందేందుకు యూట్యూబ్ చానెల్ ప్రచారం నిర్వహించాలి.

Read Also: హైదరాబాద్ లో టాప్ 5 మాల్స్, ఏడాదంతా డిస్కౌంట్లే డిస్కౌంట్లు!

⦿యూట్యూబ్ లో ఆదాయం పొందడానికి ఓర్పు, పట్టుదల అనేది చాలా ముఖ్యం. కంటెంట్ అనేది విశ్వసనీయతను కలిగి ఉంటాయి. సరైన సమయంలో సరైన టాపిక్ ను ఎంచుకోవాలి. అలా చేయడం వల్ల కంటెంట్ బాగా వీక్షకులలోకి వెళ్తుంది. సో, యూట్యూబ్ న బాగా వినియోగించుకుంటే, ఇదో వినోదం కోసం ఉపయోగించే వేదిక మాత్రమే కాదు, ఆర్ధిక విజయానికి ఓ ద్వారంగా ఉపయోగపడుతుంది. ఇంకెందుకు ఆలస్యం మీకూ యూట్యూబ్ చానెల్ ఉంటే, ఈ టిప్స్ పాటించండి. చక్కటి ఆదాయాన్ని పొందండి.

Read Also: BSNL నుంచి అదిరిపోయే ప్లాన్.. జస్ట్ రూ. 147కే నెల రోజుల వ్యాలిడిటీ!

Related News

BSNL BiTV: 450కి పైగా టీవీ ఛానెళ్లు, 25 ఓటీటీ సబ్ స్క్రిప్షన్లు.. అన్నీ కలిపి రూ.151 మాత్రమే

Jio Airtel flood relief: వరద ప్రభావితులకు రిలీఫ్.. జియో, ఎయిర్‌టెల్ వినియోగదారులకు పెద్ద గుడ్ న్యూస్!

BSNL Pay: ఫోన్ పే, గూగుల్ పే కి కాలం చెల్లినట్టేనా? రంగంలోకి దిగిన బీఎస్ఎన్ఎల్ పే..

Realme 15T Smartphone: ఏముంది రా బాబు.. రియల్‌మీ 15T స్టైలిష్ డిజైన్ లీక్

Airtel Offers: షాపింగ్ చేస్తే డబ్బులు వస్తాయా? ఎయిర్‌టెల్ కొత్త ఆఫర్‌!

Big Stories

×