BRS vs Congress: స్పీకర్ ఛాంబర్ లో బీఏసీ సమావేశం ముగిసింది. ఎరువులు, వరదలపై చర్చించాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించలేదు. ఈ క్రమంలోనే బీఏసీ సమావేశాన్ని బీఆర్ఎస్ బాయ్ కాట్ చేసింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల్లో కష్టాల్లో ఉన్న రైతు సమస్యలపై చర్చించాలని హరీష్ రావు ఫైరయ్యారు. సభ కనీసం 15 రోజులైనా జరపాలని అన్నారు. కాంగ్రెస్ నేతలు రేపటి ఏజెండా ఏంటో కూడా చెప్పడం లేదని చెప్పారు.
సరిపడా యూరియా ఇవ్వాలి…
రాష్ట్రంలో యూరియా పంపిణీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. అన్నదాతకు సరిపడా యూరియా ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ అసెంబ్లీ నుంచి వ్యవసాయ కమిషన్ వరకు బీఆర్ఎస్ నేతలు ర్యాలీగా వెళ్లారు. అక్కడకు చేరుకున్నాక అగ్రికల్చర్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. అక్కడి నుంచి నేరుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సెక్రటేరియట్ ఎదుట ఆందోళన చేపట్టారు. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని వారిని అరెస్ట్ చేశారు.
బీఆర్ఎస్ తీరుపై మంత్రి తుమ్మల ఫైర్..
ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ తీరుపై శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియాపై బీఆర్ఎస్ నేతలది కపట నాటకమని మంత్రి ఫైరయ్యారు. రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్రం కారణమని తెలియదా అని బీఆర్ఎస్ నేతలను నిలదీశారు. ఈ విషయంలో ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఏంటని మండిపడ్డారు.. బీఆర్ఎస్ తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని.. ఎట్టి పరిస్థితుల్లో జనాలు వారిని నమ్మరని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.
ALSO READ: Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం.. సెప్టెంబర్‌లోనే పంచాయతీ ఎన్నికలు