BigTV English

BSNL BiTV: 450కి పైగా టీవీ ఛానెళ్లు, 25 ఓటీటీ సబ్ స్క్రిప్షన్లు.. అన్నీ కలిపి రూ.151 మాత్రమే

BSNL BiTV: 450కి పైగా టీవీ ఛానెళ్లు, 25 ఓటీటీ సబ్ స్క్రిప్షన్లు.. అన్నీ కలిపి రూ.151 మాత్రమే
Advertisement

ఇంటర్నెట్ టీవీ4 రంగంలో ఇదో సంచలనం.
450కి పైగా లైవ్ టీవీ ఛానెళ్లు
25 ఓటీటీ ప్లాట్ ఫామ్ లు
అన్నీ కలిపి నెలకు కేవలం రూ.151
ఇది అలాంటిలాంటి ఆఫర్ కాదు. రోజుకి 5 రూపాయలు ఖర్చు చేస్తూ భారీ ఎంటర్టైన్మెంట్ ని పొందే బంపర్ ఆఫర్ ఇది. ఈ ఆఫర్ ని మనకి అందించేందుకు ముందుకొస్తోంది BSNL. కొత్తగా ఇంటర్నెట్ టీవీ రంగంలోకి వస్తున్న బీఎస్ఎన్ఎల్ బీ టీవీ అనే పేరుతో బలమైన ముద్ర వేయాలనుకుంటోంది. ఇప్పటికే సెట్ టాప్ బాక్స్ సేవలు అందిస్తోన్న టాటా స్కై, డిష్ టీవీ, సన్ డైరెక్ట్ లకు BSNL గట్టి పోటీనివ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఒకరకంగా సెట్ టాప్ బాక్స్ లకు కాలం చెల్లినట్టే చెప్పాలి.


సెట్ టాప్ బాక్స్ లు ఇక గతం..
BSNL ఇప్పటికే తన మొబైల్ వినియోగదారులకు ఉచిత బిటివి యాక్సెస్‌ను అందిస్తోంది. ఇప్పుడు కొత్తగా ప్రీమియం ప్లాన్ లో లైవ్ టివి ఛానెళ్లను జత చేసింది. సోనీ లైవ్, జీ5, ఓటిటి ప్లేతో సహా 25 ప్రీమియం ఓటిటి యాప్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌లను అందించడానికి సిద్ధమైంది. బీఎస్ఎన్ఎల్ బీ టీవీ సక్సెస్ అయితే డీటీహెచ్ సెట్-టాప్ బాక్స్‌లకు కాలం చెల్లినట్టే చెప్పాలి.

సంచలన మార్పులు..
టీవీ అనేది ప్రధాన వినోద సాధనంగా మారిన తర్వాత ఆ రంగంలో పెను మార్పులు వచ్చాయి. మొదట్లో పెద్ద యాంటెనాతో దూరదర్శన్ వచ్చేది. ఆ తర్వాత కేబుల్ కనెక్షన్ ద్వారా ప్రైవేట్ ఛానెల్స్ కూడా ప్రసారం అయ్యేవి. కేబుల్ టీవీ ప్రసారాలు చాలాకాలం రాజ్యమేలాయి. ఆ తర్వాత మెల్లగా ఆ స్థానాన్ని డిష్ టీవీ ఆక్రమించింది. కేబుల్స్ తో పని లేకుండా నేరుగా ఇంటిపైనే డిష్ యాంటెనా ఫిక్స్ చేసుకుని ప్రసారాలను నిరంతరాయంగా చూసేవారు. దాన్ని ఇప్పుడు ఇంటర్నెట్ టీవీ రీప్లేస్ చేస్తోంది. ఇంటర్నెట్ కనెక్షన్ తో టీవీలో నిరంతర ప్రసారాలు అందిస్తోంది. జియో, ఎయిర్ టెల్ ఈ ఇంటర్నెట్ టీవీ రంగంలోకి వచ్చాయి. వీటికి బీఎస్ఎన్ఎల్ బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. నేరుగా 450 లైవ్ ఛానెల్స్ అంటే మాటలు కాదు. వాటితోపాటు 25 ఓటీటీ ప్లాట్ ఫామ్ ల సబ్ స్క్రిప్షన్ కూడా బీఎస్ఎన్ఎల్ అందించేందుకు సిద్దమైంది. ఇన్ని ఇస్తున్నా కూడా నెలకు కేవలం 151 రూపాయల అద్దె మాత్రమే వసూలు చేస్తానంటోంది. ఈ ఆఫర్ నిజంగా గేమ్ ఛేంజర్ అని చెప్పాలి.

BSNL తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ కొత్త ప్లాన్‌ను అధికారికంగా ప్రకటించింది. BiTV ప్రీమియం ప్లాన్ నెల అద్దె రూ. 151 గా పేర్కొంది. రూ.151కి ఆల్ ఇన్ వన్ ఎంటర్‌టైన్‌మెంట్ అందుకోండి అంటూ BSNL ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ప్రీమియం ప్లాన్‌తో పాటు, BSNL మరో రెండు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్ లను కూడా ప్రవేశపెట్టింది. రూ.28 చెల్లిస్తే 30 రోజుల “వినోద ప్యాక్”ను అందిస్తోంది, దీని ద్వారా వినియోగదారులకు ఏడు OTT యాప్‌లతో పాటు తొమ్మిది ఉచిత OTT యాప్‌లను యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్లాన్ రూ.29లో కూడా అందుబాటులో ఉంది. మొత్తమ్మీద బీఎస్ఎన్ఎల్ సంచలనాలకు తెరతీసిందనే చెప్పాలి. బీఎస్ఎన్ఎల్ పే పేరుతో డిజిటల్ పేమెంట్ల రంగంలో కూడా పెత్తనం చలాయించేందుకు బీఎస్ఎన్ఎల్ సంస్థ సిద్దమైంది. ఇటు ఇంటర్నెట్ టీవీ రంగంలో కూడా భారీ ఆఫర్లతో దూసుకొస్తోంది.

Related News

Jio Utsav Sale: జియో ఉత్సవ్ మొదలైంది.. ఈ వస్తువులపై బంపర్ డిస్కౌంట్

Amazon Great Indian Festival: అమెజాన్ వీకెండ్ వచ్చేసిందోచ్చ్.. 50శాతం నుండి 72శాతం వరకు తగ్గింపు

Festival Of Electronics: రిలయన్స్ డిజిటల్‌లో ‘ఎలక్ట్రానిక్స్ ఫెస్టివల్’, నమ్మలేనంత తక్కువ ధరలు.. ఇంకెందుకు ఆలస్యం !

Gold rate Dropped: భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?

JioMart Offer: రెండు రోజులు మాత్రమే.. జియోమార్ట్‌లో కేవలం రూ.99 నుంచే బ్యూటీ ప్రోడక్ట్స్‌

BSNL Offers: బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు దీపావళి బొనాంజా.. లక్కీ డ్రాలో 10 గ్రాముల సిల్వర్ కాయిన్.. భారీ తగ్గింపులు

Redmi K90 Pro Max: రెడ్ మీ నుంచి క్రేజీ ఫోన్.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

JioFinance Offer: ఫ్రీగా బంగారం.. జియో ఫైనాన్స్ అదిరిపోయే ఆఫర్!

Big Stories

×