DMart Offers: డీమార్ట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. తక్కువ ధరలు, మంచి నాణ్యత, ఇంటి అవసరాలన్నీ ఒకే చోట దొరికే సౌకర్యం. ఇవన్నీ కలిపి డీమార్ట్‌కు సాధారణ ప్రజల్లో ఒక ప్రత్యేక స్థానం కల్పించాయి. ప్రతిరోజూ మనకు కావలసిన బియ్యం, పప్పులు, నూనెలు, టీ, కాఫీ, సబ్బులు, డిటర్జెంట్లు, ఇంకా ఎన్నో రకాల వంటింటి సరుకులు. అన్నీ డీమార్ట్‌లో తక్కువ ధరలో దొరుకుతాయనే నమ్మకంతోనే కోట్లాది మంది వినియోగదారులు దీన్ని ఎంచుకుంటారు. ఇప్పుడా డీమార్ట్ తన ఆన్‌లైన్ యాప్ ‘డీమార్ట్ రెడీ’ ద్వారా వినియోగదారులకు మరింత సౌకర్యం అందిస్తోంది. ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు చేరేలా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించడం ద్వారా వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పుడు సరికొత్తగా వినియోగదారుల కోసం ఒక ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. అదే ఇట్స్ రైనింగ్ డిస్కౌంట్స్.
ఇట్స్ రైనింగ్ డిస్కౌంట్స్ ఆఫర్లు ఏమిటి?
ఇట్స్ రైనింగ్ డిస్కౌంట్స్ పేరుతో వచ్చిన ఈ ఆఫర్ పై, మనకి కావాల్సిన రోజువారీ ఉత్పత్తులను తక్కువ ధరల్లోనే ఇంటి వద్దకు తీసుకురావడమే కాకుండా, కొత్త కస్టమర్లకు అదనంగా ఉచిత హోమ్ డెలివరీ సదుపాయం కూడా అందిస్తున్నారు. సాధారణంగా ఆన్‌లైన్ షాపింగ్‌లో డెలివరీ ఛార్జీలు ఒక పెద్ద సమస్యగా మారుతాయి. కొన్నిసార్లు మనం కొంత చిన్న మొత్తం విలువైన వస్తువులు ఆర్డర్ చేస్తే, దానికన్నా ఎక్కువ డెలివరీ ఛార్జీలు వేసే పరిస్థితి ఉంటుంది. అలాంటి సమస్యను పూర్తిగా తొలగించేందుకు డీమార్ట్ ఈసారి కొత్తగా చేరుతున్న వినియోగదారులకు మొదటి మూడు ఆర్డర్లపై పూర్తిగా ఉచిత డెలివరీ ఆఫర్‌ను ప్రకటించింది.
ఆపర్ ఎప్పటి వరకు?
ఈ ఆఫర్‌ను డీమార్ట్ 2025 ఆగస్టు 25న ప్రారంభించింది. ఇది పరిమిత కాలం పాటు మాత్రమే అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 10వ తేదీ వరకు వినియోగదారులు ఈ సదుపాయాన్ని పొందవచ్చు. అంటే మొత్తం పదిహేను రోజుల పాటు మాత్రమే ఈ ఆఫర్ అమల్లో ఉంటుంది. అందువల్ల ఆలస్యం చేయకుండా, ఆగస్టు చివరి వారంలోనో లేదా సెప్టెంబర్ మొదటి వారంలోనో, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.
ఆ వస్తులపైనే డీమార్ట్ ప్రచారం..
డీమార్ట్ ప్రచారంలో చూపించిన ఉత్పత్తులు కూడా మన ప్రతిరోజూ ఉపయోగించే వస్తువులే. టీ, సబ్బులు, డిటర్జెంట్లు, బియ్యం, క్లీనింగ్ లిక్విడ్స్, పాలు, వెన్న, నూనెలు, స్నాక్స్, ఇంకా అనేక రకాల హౌస్‌హోల్డ్ అవసరాలన్నీ మనకు అవసరమైన ప్రతి వస్తువు కూడా ఇందులో అందుబాటులో ఉంటుంది. ఉదాహరణకు రెడ్ లేబుల్ టీ, సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్, దావత్ రైస్, లైజాల్ క్లీనర్, అమూల్ బటర్ వంటి వస్తువులను ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఇవన్నీ ఇంటి పనికొచ్చే వాటే కాబట్టి ఎక్కువమందికి ఈ ఆఫర్ నిజంగా ఉపయోగపడే అవకాశం ఉంది.
Also Read: OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీల్లోకి బోలెడు సినిమాలు.. ఆ 6 తప్పక చూడాల్సిందే మరి..!
వినియోగదారుల్ని ఆకట్టుకునే ప్రయత్నం
డీమార్ట్ ఎప్పటినుంచో తక్కువ ధరల్లో క్వాలిటీ ఉత్పత్తులను అందిస్తూ వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకుంది. ఇప్పుడు ఆ విశ్వాసాన్ని మరింత బలపరిచే ప్రయత్నంగానే ఈ ఆఫర్‌ను ముందుకు తెచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బిజీగా ఉండే కుటుంబాలు, ఉదయం ఆఫీస్‌కి వెళ్లే తొందరలో బయట షాపింగ్‌కి టైమ్ దొరకని వారు, ఇంట్లో చిన్నపిల్లలు లేదా పెద్దలు ఉండి బయటకు వెళ్లలేని వారు, వారానికి ఒకసారి షాపింగ్ కోసం సమయం కేటాయించలేని వారు ఇలాంటి వారి కోసం ఈ ఆఫర్ ఎంతో ఉపయోగంగా ఉంటుంది.
స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఆఫర్
అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. డీమార్ట్ ఇప్పటికే తెలిపినట్టుగా, ఈ ఆఫర్లు స్టాక్ అందుబాటులో ఉన్నంత వరకు మాత్రమే వర్తిస్తాయి. పైగా, లొకేషన్ ఆధారంగా కూడా ధరల్లో మార్పులు ఉండవచ్చు. ఒక ప్రాంతంలో ఎక్కువ తగ్గింపులు కనిపిస్తే, ఇంకో ప్రాంతంలో తగ్గింపు తక్కువగా ఉండొచ్చు. అంటే మనం చూసే డిస్కౌంట్లు, డెలివరీ స్లాట్లు అన్నీ యాప్‌లో ఆర్డర్ చేసే సమయంలో స్పష్టంగా చెక్ చేయడం తప్పనిసరి.
ఈరోజు ఆఫర్ రేపు ఉండకపోవచ్చు..
ఇంకా ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే, డీమార్ట్ మేనేజ్‌మెంట్‌కు ధరలు, ఆఫర్లు ఎప్పుడైనా మార్చే హక్కు ఉంటుంది. అంటే మీరు ఈ రోజు చూసే ఆఫర్, రేపటికి అదే విధంగా ఉండకపోవచ్చు. అందుకే ఈ రకమైన పరిమిత కాల ఆఫర్లు ఉన్నప్పుడు వినియోగదారులు ఆలస్యం చేయకుండా తక్షణమే ఆర్డర్ చేయడం మంచిది.
డెలివరీ ఛార్జీలలో మార్పులు తప్పని సరి
ఈ ఆఫర్ వల్ల వినియోగదారులు పొందే లాభాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకవైపు తగ్గింపు ధరల్లో వస్తువులు అందుకుంటారు. మరోవైపు డెలివరీ ఛార్జీలు పూర్తిగా మాఫీ అవుతాయి. అంటే డబ్బు కూడా ఆదా అవుతుంది, సమయం కూడా ఆదా అవుతుంది. ఇంటి వద్దకే వస్తువులు చేరడంతో పాటు, మూడు వరుస ఆర్డర్లకు ఎలాంటి అదనపు డెలివరీ ఛార్జీలు ఉండవు. ఇది సాధారణంగా ఇతర ఆన్‌లైన్ గ్రోసరీ యాప్‌లలో అరుదుగా కనిపించే సదుపాయం.
యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
మొత్తం మీద చెప్పాలంటే, డీమార్ట్ రెడీ యాప్ ఈసారి తీసుకొచ్చిన “ఇట్స్ రైనింగ్ డిస్కౌంట్స్” ఆఫర్ వినియోగదారుల కోసం ఒక మంచి అవకాశం. 2025 ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 10 వరకు మాత్రమే కొనసాగనున్న ఈ ఆఫర్‌ను మిస్ అయితే మళ్లీ ఇలాంటి సదుపాయం త్వరగా రావడం కష్టమే. అందువల్ల వినియోగదారులు వెంటనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ఈ ప్రత్యేక ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలి.