BigTV English

Google:గూగుల్ కొత్త అప్డేట్.. ఇంకాగ్నిటో కోసం..

Google:గూగుల్ కొత్త అప్డేట్.. ఇంకాగ్నిటో కోసం..

Google:గూగుల్ అనే సెర్చ్ ఇంజన్ వచ్చిన తర్వాత టెక్నాలజీలో ఎన్నో మార్పులు వచ్చాయి. తెలియని విషయం ఏదైనా గూగుల్ చేస్తే చాలు.. అనే ధీమా వచ్చేసింది. యూజర్లు పెరుగుతున్న కొద్దీ గూగుల్ కూడా వారికి ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే వచ్చింది. తాజాగా గూగుల్.. తన యూజర్ల కోసం కొత్త అప్డేట్‌ను తీసుకొచ్చింది.


ఇప్పటివరకు గూగుల్‌కు పోటీగా ఏ సెర్చ్ ఇంజన్ నిలబడలేదు. కానీ ఇప్పుడిప్పుడే టెక్నాలజీ పెరుగుతుండడంతో గూగుల్ కూడా అప్డేట్స్ విషయంలో స్పీడ్ పెంచాల్సి వస్తుంది. అందులో భాగంగానే ఇంకాగ్నిటోకు లాక్ వేసుకునే ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఆండ్రాయిడ్‌లో క్రోమ్ ఇంకాగ్నిటో ఉపయోగించేవారు దానికి లాక్ వేసుకోవచ్చునని ప్రకటించింది.

స్మార్ట్ ఫోన్లతో ప్రైవసీ ఉండదూ అని భావించే వారికి ఎప్పటికప్పుడు ఎన్నో ప్రైవసీ అప్డేట్స్‌ను తీసుకొస్తుంది ఆండ్రాయిడ్. స్క్రీన్ లాక్, యాప్ లాక్స్ లాంటి ఎన్నో సౌలభ్యాలను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. అలాగే గూగుల్ కూడా ఇంకాగ్నిటోకు లాక్ పెట్టుకునే అవకాశాన్ని యూజర్లకు అందిస్తోంది. పిన్ లేదా ప్యాటర్న్ లాక్‌తో ఇంకాగ్నిటో సమాచారాన్ని గోప్యంగా ఉంచవచ్చని గూగుల్ చెప్తోంది.


క్రోమ్‌కు కాకుండా ఇంకాగ్నిటోకు మాత్రమే ఈ లాక్ అప్డేట్ ఉంటుందని సమాచారం. ఒకే ఎకౌంట్‌తో చాలామంది క్రోమ్‌ను ఉపయోగిస్తుంటే.. ఇంకాగ్నిటోలో సమాచారాన్ని ఇతర యూజర్లకు తెలియకుండా ఉండడానికి ఈ అప్డేట్ పనిచేస్తుంది. డేటా ప్రైవసీ డే సందర్భంగా ఈ అప్డేట్‌ గురించి బయటపెట్టింది గూగుల్. ఇప్పటికీ కొన్ని ఫోన్లలో ఈ అప్డేట్ అందుబాటులోకి రాలేదని, దానికి మరికొంత సమయం పడుతుందని వారు తెలిపారు.

Govt Provides Solar:ఆ రాష్ట్రంలో ఇంటింటికి ఉచితంగా సోలార్..

2500 year old ornaments: 2500 ఏళ్లనాటి ఆభరణాలు.. తవ్వకాల్లో బయటికి..

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×