E-Paper
Advertisement

Bank Queue: బ్యాంకు ముందు నోట్ల రద్దు తరహా భారీ లైన్లు.. కారణం ఇదే

Bank Queue: బ్యాంకు ముందు నోట్ల రద్దు తరహా భారీ లైన్లు.. కారణం ఇదే
Advertisement

Bank Queue: చిన్న నోట్ల కొరతను తగ్గించాలని ఆర్‌బీఐ ఆదేశించిన నేపథ్యంలో గుజరాత్ మెహ్సానాలోని బ్యాంకు ముందు భారీ లైన్లు దర్శనమిస్తున్నాయి. మెహ్సానాలోని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు వద్ద కొత్త రూ.10 నోట్లు, నాణేల కోసం జనం బారులు తీరారు.

గుజరాత్‌లోని మెహ్సానాలో బ్యాంకు ముందు జనం భారీ క్యూలు కట్టారు. స్థానిక అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు ముందు నోట్ల రద్దు సమయంలో నెలల తరబడి బ్యాంకుల ముందు కనిపించిన లైన్లు మరోసారి గుజరాత్ లో కనిపిస్తున్నాయి. అయితే ఇందుకు కారణం.. కొత్త రూ.10 నోట్ల పంపిణీ అని తెలుస్తోంది. కొత్త రూ.10 నోట్లు పంపిణీ చేపట్టడంతో బ్యాంకు ముందు జనం గుమ్మిగూడారు.

చిన్న నోట్లు, నాణేలు పంపిణీ

Advertisement

ఆర్‌బీఐ ఆదేశాల మేరకు కొత్త నోట్లు, చిన్న విలువ నాణేలను జారీ చేయడానికి మెహ్సానాలో బ్యాంకు ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసింది. అయితే బ్యాంకు అంచనాలను మించి జనం వచ్చారు. మంగళవారం ఉదయం నుండే వందలాది మంది లైన్లలో ఉన్నారు. స్థానిక వ్యాపారులకు తక్కువ విలువ కలిగిన కరెన్సీ కొరతను పరిష్కరించడానికి ఈ శిబిరాన్ని నిర్వహించినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. ఈ డ్రైవ్ లో బ్యాంకు రూ. 14 లక్షల విలువైన కొత్త రూ. 10 నోట్లు 140 కట్టలను జారీ పంపిణీ చేసింది. రూ. 2, రూ. 5 విలువ కలిగిన దాదాపు రూ. 3 లక్షల విలువైన నాణేలు, రూ. 20 నోట్లు 70 కట్టలను పంపిణీ చేసింది. ప్రతి వినియోగదారుడికి ఒక కట్ట నోట్లతో పాటు నాణేల ప్యాకెట్‌ను అందజేశారు.

ఆర్బీఐ సూచనల మేరకు

మంగళవారం ఉదయం 10 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభమై సాయంత్రం వరకు కొనసాగింది. రోజువారీ ఖర్చులు, పిల్లల అవసరాలు, వివాహాలు ఇతర అవసరాలను దృష్టిలో పెట్టుకుని చిన్న నోట్లు, నాణేలు కోసం జనం బ్యాంకుకు క్యూకట్టారు. బ్యాంకు మేనేజర్ ముఖేష్‌భాయ్ పటేల్ మాట్లాడుతూ.. ఆర్‌బీఐ సూచనల మేరకు ఈ శిబిరం ఏర్పాటు చేశామని తెలిపారు.

Advertisement

Also Read: Ustad Bhagat Singh Release: ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేది అప్పుడే… రిలీజ్ పై బిగ్ అప్డేట్!

Tags

Related News

పిల్లలకు పుట్టినరోజు బహుమతులు ఇవ్వడమే కాదు.. జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ 7 అలవాట్లు నేర్పండి

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Big Stories

Advertisement
×