E-Paper
Advertisement

OTT Movie : ఐస్ ముక్కల మధ్య తెగిపడిన చెయ్యి… ఇంటెన్స్ తమిళ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

OTT Movie : ఐస్ ముక్కల మధ్య తెగిపడిన చెయ్యి… ఇంటెన్స్ తమిళ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
Advertisement

OTT Movie : ఈ మధ్య కాలంలో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లను ఆడియన్స్ తెగ చూస్తున్నారు. ఇవి చూపు తిప్పుకోకుండా చేస్తున్నాయి. ప్రతి భాషలోనూ ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి. థ్రిల్లర్ ఫ్యాన్స్ ను అలరించడానికి మరో సరికొత్త తమిళ సిరీస్ ఓటీటీలో అడుగు పెట్టబోతోంది. ప్రముఖ రచయిత రాజేష్ కుమార్ నవల ఆధారంగా ఈ సిరీస్ రూపొందింది. ఈ సిరీస్ ట్రైలర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది. థ్రిల్లర్ ప్రియులకి చిల్లింగ్ థ్రిల్ ని ఇచ్చేటట్టే ఉంది. మరో వారం రోజుల్లో స్ట్రీమింగ్ కి కూడా సిద్ధంగా ఉంది. ఫార్మా మాఫియా హత్యల చుట్టూ జరిగే ఇన్వెస్టిగేషన్ తో ఈ స్టోరీ ఉత్కంఠంగా సాగనుంది. దీని పేరు ఏంటి ? ఏ ఓటీటీలోకి రానుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

దినకరన్ ఎం దర్శకత్వంలో వచ్చిన ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘రేగై’. రజేష్ కుమార్ నవల ఆధారంగా రూపొందిన ఈ 7 ఎపిసోడ్ల సిరీస్ లో బాలా హసన్, పవిత్ర జానని, వినోతిని వైద్యనాథన్ లీడ్ రోల్స్‌లో నటించారు. ఇది ZEE5 తమిళ ఒరిజినల్‌గా నవంబర్ 28న ప్రీమియర్ అవుతుంది. ఓటీటీప్లే ప్రీమియంలో కూడా ఈ సిరీస్ ను చూడొచ్చు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

చెన్నై నగరంలో ఒక భయంకరమైన సంఘటనతో ఈ స్టోరీ మొదలవుతుంది. ఒక ఐస్ విక్రేత ప్రమాద వశాత్తు మరణిస్తాడు. అయితే అతను తీసుకెళ్తున్న ఐస్ బాక్స్ లో నరికిన చేతులు ఉంటాయి. దీంతో సబ్-ఇన్‌స్పెక్టర్ వెట్రి, తన పై అధికారుల ఆదేశాల మేరకు, కేసును విచారించడం ప్రారంభిస్తాడు. మొదట ఇది ఒక సాధారణ నేరంగా అనిపిస్తుంది. అయితే కేసును పరిశోధించే కొద్దీ మరో నాలుగు మరణాలకి దీనికి లింకు ఉంటుంది. వెట్రికి అనేక సందేహాలు కలుగుతాయి. లోతుగా విచారించే కొద్దీ దీని వెనుక ఉన్న మెడికల్ మాఫియా కుట్ర వెలుగులోకి వస్తుంది.

Read Also : ట్యూషన్ టీచర్‌పై ప్రేమ… ప్రేమించిన వాడు దక్కలేదని ఆ పిల్ల చేసే పనికి ఫ్యూజులు అవుట్

Advertisement

ఈ కేసు వెనుక ఏదో పెద్ద కుట్ర దాగి ఉందని అతను గ్రహిస్తాడు. అతను ఒక పెద్ద కుంభకోణంతో ఈ హత్యలకి లింకు ఉందని తెలుసుకుంటాడు. ఈ దర్యాప్తులో ఊహించని ట్విస్ట్లు ఒక దాని వెనుక ఒక వస్తూనే ఉంటాయి. చివరి ఎపిసోడ్ లోనే అసలు విషయం బయట పడుతుంది. చివరికి వెట్రి వెలుగులోకి తెచ్చే నిజలు ఏమిటి ? మెడికల్ మాఫియాకి ఈ హత్యలకు ఉన్న లింకు ఏంటి ? అసలు ఈ మెడికల్ కుంభకోణం ఏమిటి ? అనే విషాయాలను, ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను చూసి తెలుసుకోండి.

 

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×