Big Stories

HDFC : హెచ్‌డీఎఫ్‌సీ, ఐఆర్‌సీటీసీ కో బ్రాండ్ క్రెడిట్ కార్డ్.. లాభాలేంటో తెలుసా?

HDFC launched new credit card in association with IRCTC

రైళ్లలో ఎక్కువగా ప్రయాణాలు చేసేవాళ్లలో చాలా మంది… ఐఆర్‌సీటీసీ, ఎస్బీఐ కో బ్రాండ్ క్రెడిట్ కార్డ్ ద్వారా టికెట్లు రిజర్వ్ చేసుకుంటూ ఉంటారు. పూర్తిగా రివార్డ్ పాయింట్లతోనే టికెట్లు రిజర్వ్ చేసుకునే సౌలభ్యం ఉండటం ఐఆర్‌సీటీసీ, ఎస్బీఐ కో బ్రాండ్ క్రెడిట్ కార్డ్ ప్రత్యేకత. ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా ఐఆర్‌సీటీసీతో జతకట్టి… ఓ కొత్త క్రెడిట్‌ కార్డును జారీ చేసింది. రూపే నెట్‌వర్క్‌పై పని చేసే ఈ క్రెడిట్‌ కార్డు ద్వారా రైల్వే టికెట్‌ బుకింగ్‌లపై డబ్బు ఆదా చేసుకోవడంతో పాటు, ఇతర ప్రయోజనాలు లభిస్తాయని… రెండు సంస్థలు ప్రకటించాయి. ఈ క్రెడిట్‌ కార్డు కావాలనుకున్న వాళ్లు హెచ్‌డీఎఫ్‌సీ, ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ల ద్వారా లేదా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ బ్రాంచ్‌లకు వెళ్లి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

- Advertisement -

ఐఆర్‌సీటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ కో బ్రాండ్ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే… వెల్‌కమ్‌ బెనిఫిట్‌ కింద రూ.500 విలువ చేసే అమెజాన్‌ వోచర్‌ పొందవచ్చు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌, ఐఆర్‌సీటీసీ యాప్‌ల ద్వారా టికెట్‌ బుక్ చేస్తే… ప్రతి 100 రూపాయల కొనుగోలుపై 5 రివార్డు పాయింట్లు ఇస్తారు. హెచ్‌డీఎఫ్‌సీ స్మార్ట్‌ బైలో కొనుగోళ్లపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌తో పాటు ప్రతి 100 రూపాయల కొనుగోలుపై ఒక రివార్డు పాయింట్‌ లభిస్తుంది. ఈఎంఐ, ఫ్యూయల్‌, వాలెట్‌ రీ లోడ్‌ లావాదేవీలు, అద్దె చెల్లింపులు, ప్రభుత్వానికి సంబంధించిన లావాదేవీలపై రివార్డు పాయింట్లు ఇవ్వరు.

- Advertisement -

రైళ్లలో ఏసీ టికెట్‌ బుకింగ్‌పై అదనంగా రివార్డు పాయింట్లు ఇవ్వడం ఐఆర్‌సీటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ కో బ్రాండ్ క్రెడిట్ కార్డ్ ప్రత్యేకత. అంతేకాదు… ఏడాదికి 8 సార్లు ఐఆర్‌సీటీసీ రైల్వే లాంజ్‌ యాక్సెస్‌ ఉంటుంది. రివార్డు పాయింట్లను టికెట్ బుకింగ్ సమయంలో రిడీమ్ చేసుకోవచ్చు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌, యాప్‌లో లావాదేవీ ఛార్జీలపై 1 శాతం రాయితీ వర్తిస్తుంది. కార్డు జారీ చేసిన 30 రోజుల్లో యాక్టివేట్‌ చేసుకుంటే రూ.500 వెల్‌కమ్‌ గిఫ్ట్‌ లభిస్తుంది. అలాగే కార్డు జారీ చేసిన 90 రోజుల్లో రూ.30 వేల విలువైన కొనుగోళ్లు జరిపితే మరో రూ.500 గిఫ్ట్‌ వోచర్‌ రూపంలో ఇస్తారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News