BigTV English

Tips For Car Shine: కార్ షైన్‌ను కాపాడుకునే టెక్నిక్స్..

Tips For Car Shine: కార్ షైన్‌ను కాపాడుకునే టెక్నిక్స్..

Tips For Car Shine : చాలామంది తాము ఇష్టపడి కొనుకున్న కార్లను, బైక్‌లను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ కొంతమందికి వీటిని సరిగా మెయింటేయిన్ చేయడం రాక అప్పుడప్పుడు కొన్ని తప్పులు చేస్తుంటారు. కేవలం కారు నడిచే విధానంలోనే కాదు.. కనిపించే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు నిపుణులు. అంటే కారు షైన్ పోకుండా దానిని జాగత్ర్తగా ఎలా చూసుకోవాలి అనే విషయంపై వారు కొన్ని టిప్స్‌ను అందిస్తున్నారు.


రోజూ వాష్ చేయడం ద్వారా కార్ షైన్ అనేది చెక్కుచెదరకుండా ఉంటుందని నిపుణులు అంటున్నారు. కానీ ఇందులో కూడా కొన్ని సూచనలు ఉంటాయన్నారు. కారును ఏదో ఒక ప్రొడక్ట్‌తో వాష్ చేయడం కూడా మంచిది కాదని, దానికోసం ప్రత్యేకంగా ఉన్న ప్రొడక్ట్స్‌తో వాష్ చేయడమే మంచిదన్నారు. పైగా కార్ వాష్ చేసిన తర్వాత సరిగ్గా డ్రై అవ్వకపోతే.. ఆ నీటి మరకలు అలాగే ఉండిపోతాయని, కనపిస్తాయని చెప్తున్నారు.

వ్యాక్సింగ్ అనేది కూడా కార్ షైన్‌ను కాపాడుతుందని నిపుణులు చెప్తున్నారు. ముందుగా దీనికోసం కారు పెయింట్‌కు సూట్ అయ్యే వ్యాక్స్‌కు తీసుకోవాలి. వ్యాక్స్ కారుకు అప్లై చేసే ముందు కారు అసలు తడిగా ఉండకూడదు. చిన్న చిన్న భాగాలుగా ఈ వ్యాక్స్‌ను అప్లై చేయాలి. పూర్తిగా ఎండిపోయిన తర్వాత జాగ్రత్తగా ఈ వ్యాక్స్‌ను తొలగించాలి. ఇక వ్యాక్స్‌ను ఎలా అప్లై చేయాలి, ఎప్పుడు క్లీన్ చేయాలి అనే విషయాలు వ్యాక్స్ మ్యానుఫ్యాక్చర్స్ కూడా అందిస్తారని నిపుణులు తెలిపారు.


పాలిషింగ్ అనేది దేని షైన్‌ను కాపాడడానికి అయినా బెస్ట్ సొల్యూషన్. కార్ పెయింట్ వర్క్‌ను మరింత బ్రైట్‌గా చూపించడానికి పాలిషింగ్ ఉపయోగపడుతుంది. కార్లకు ఎన్నో రకాల పాలిష్ టెక్నిక్స్ ఉంటాయి. అంతే కాకుండా దీనిని జాగ్రత్తగా అప్లై కూడా చేయాలి. కారుపై పాలిష్‌ను వేసిన తర్వాత ఎక్కువగా ప్రెజర్ పెట్టడానికి మొత్తం సమానంగా తుడవాలి. ఇలాంటి చిట్కాలు పాటిస్తే.. కార్ షైనింగ్ అనేది నేచురల్‌గా బాగుంటుందని నిపుణులు సలహా ఇస్తున్నారు.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×