E-Paper
Advertisement

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…
Advertisement

Hit And Run Case: హిట్ అండ్ రంగ్ కేసులో భాగంగా ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి (Anand Sai)కుమారుడు సందీప్(Sandeep) ను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా సందీప్ కు బెయిలు రావడంతో ఈ కేసు నుంచి కాస్త ఉపశమనం లభించింది అని చెప్పాలి. అసలు సందీప్ అరెస్టు కావడానికి గల కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే..

సందీప్ ఆనంద్ కు ఊరట..

సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఖాజా గూడా అంకుర ఆస్పత్రి ఎదురుగా ఓ ఆర్ ఆర్ రోటరీ నుంచి ఖాజా గూడా వైపు వెళ్లేందుకు రోడ్డు దాటుతున్న బీహార్ కు చెందిన నందకిషోర్ అనే యువకుడికి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నందకిషోర్ ను వెంటనే అంకుర ఆస్పత్రికి తీసుకెళ్లడం కోసం ఇనోవా కారు డ్రైవర్ ప్రయత్నం చేశారు. ఈ సమయంలోనే వాళ్లు రోడ్డు దాటుతుండగా నానక్ గూడ ఓ ఆర్ ఆర్ రోటరీ వైపు అతివేగంతో దూసుకెళ్తున్న మహేంద్ర కారు వారిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మహేంద్ర కారు ఆగకుండా వెళ్ళిపోయింది.

కారు నడిపిన సందీప్ ఆనంద్..

Advertisement

ఈ రోడ్డు ప్రమాదంలో భాగంగా నందకిషోర్ అక్కడికక్కడే మరణించగా డ్రైవర్ జైద్ షా తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రమాద ఘటనపై హిట్ అండ్ రన్ కేస్(Hit And Run Case) నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలను పరిశీలించిన పోలీసులు ఈ ప్రమాదానికి కారణమైన మహేంద్ర కారును గుర్తించారు. అయితే ఈ ప్రమాద సమయంలో కారు నడిపింది ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్ అని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం పోలీసులు సందీప్ ఆనంద్ ను అదుపులోకి తీసుకున్నారు.

బెయిల్ మంజూరు చేసిన కోర్టు..

ఇలా పోలీసులు అదుపులో ఉన్నటువంటి సందీప్ ఆనంద్ కు నేడు బెయిల్ మంజూరు కావటం విశేషం. ఈ కేసులో భాగంగా సందీప్ కు ఉప్పరపల్లి కోర్టు ఫెయిల్ మంజూరు చేసింది. ఇలా అరెస్ట్ అయిన సందీప్ కు బెయిల్ మంజూరు కావడంతో పలువురు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన పవర్ ఉపయోగించడం వల్లే సందీప్ ఆనంద్ బెయిల్ మీద బయటకు వచ్చారు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సినీ నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రాణ స్నేహితులు అనే విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తన కొడుకు విషయంలో పవన్ కళ్యాణ్ తన పవర్ ఉపయోగించి సందీప్ ఆనంద్ కు బెయిల్ వచ్చేలా చేసారంటూ పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆనంద్ సాయి విషయానికి వస్తే ఈయన ఆర్కిటెక్ గా భారీ క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఎన్నో ఆలయాలకు నమూనాలను అందించారు అదేవిధంగా ఆనంద్ సాయి ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ గా కూడా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

Also Read: ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Related News

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

Big Stories

Advertisement
×