E-Paper
Advertisement

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!
Advertisement

BRS Protest: కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడిచినా ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ హుజూరాబాద్‌ అంబేడ్కర్‌ చౌరస్తాలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు బుధవారం భారీ నిరసన చేపట్టాయి. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేలాదిగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘420 హామీలు – 420 ఫిట్లు’ ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ, ప్రభుత్వం ప్రజలకు చెల్లించాల్సిన బకాయిలతో కూడిన ‘కాంగ్రెస్‌ బాకీ కార్డు’లను పంపిణీ చేశారు.

ఆరు గ్యారెంటీలపై..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. దేవుళ్ల సాక్షిగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్‌ విస్మరించి ప్రజలను వంచించిందని విమర్శించారు. మహిళలకు నెలకు రూ.2,500 సాయం, తులం బంగారం, రూ.2 లక్షల రుణమాఫీ, రైతుభరోసా, పింఛన్ల పెంపు, 2 లక్షల ఉద్యోగాల భర్తీ వంటి కీలక హామీలను గాలికొదిలేసిందని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే వరకు రాజీలేని పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Also read: ఎంపీ ధర్మపురి అరవింద్‌కు బిగ్ షాక్.. తిరగబడ్డ సొంత పార్టీ నేతలు!

పెద్ద సంఖ్యలో..

ఈ ఆందోళనలో బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు బండ శ్రీనివాస్‌, వాల బాలకిషన్‌రావు, పోల్నేని సత్యనారాయణరావు, నైనేని తిరుపతిరావు, పింగిలి రమేశ్‌లతో పాటు నియోజకవర్గ పరిధిలోని వీణవంక, ఇల్లందకుంట, కమలాపూర్, హుజూరాబాద్, జమ్మికుంట మండలాల ప్రజాప్రతినిధులు, మున్సిపాలిటీల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Also read: మేమొచ్చినా.. వెంట‌నే హామీలు అమ‌లు చేయ‌లేం.. ! కుదురుకోవ‌డానికి ఐదారేళ్లు ప‌డుతుందేమో..? ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై కేటీఆర్ కామెంట్స్‌..

Tags

Related News

హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

క్యూనెట్ రూ.10,000 కోట్ల కుంభకోణం.. మరో కీలక నిందుతుడు అరెస్ట్?

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

గత ఏడాది కంటే భారీగా పెరిగిన విద్యుత్ వాడకం.. ఓక్కరోజులోనే ఇంత వాడేసారా..?

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

Big Stories

Advertisement
×