Extramarital Affair Murder| ఓ యువకుడిని ఆ గ్రామం వారు బలవంతంగా వివాహం చేశారు. పెళ్లి తరువాత వధువు ఎక్కువగా తన పుట్టింట్లోనే ఉండేది. భర్త పిలిచినా ఆమె వచ్చేది. ఒకరోజు భర్త ఆమెను తీసుకువచ్చేందుకు అత్తారింటికి వెళ్తే.. ఆమె మరో పురుషుడి కౌగిట్లో కనిపించింది. దీంతో ఆ యువకుడు వారితో గొడవపడ్డాడు. ఆ తరువాత ఫోన్ చేసి జరిగినదంతా తన తల్లిదండ్రులకు చెప్పాడు. వారంతా అక్కడికి చేరుకునే సమయానికి ఆ యువకుడు విషం ప్రయోగంతో మృతిచెందాడు. ఈ ఘటన బిహార్ రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. బిహార్ రాష్ట్రం నలందా జిల్లా ఫూల్‌పూర్ గ్రామానికి చెందిన రాహుల్ కుమార్ (20) సంవత్సరం క్రితం పకడ్వా బియాహ్ (బలవంతపు పెళ్లి) ప్రకారం వివాహం జరిగింది. బిహార్ రాష్ట్రంలో యువకులను కిడ్నాప్ చేసి బలవంతంగా ఒక యువతితో పెళ్లి చేస్తారు. అక్కడ కట్నం నుంచి తప్పించుకోవడానికి పెళ్లికూతురు కుటుంబం వారు రౌడీల సాయంతో యువకుడిని కిడ్నాప్ చేసి ఆ తరువాత వారి అమ్మాయితో అతడి వివాహం చేస్తారు. వధూ వరులను మూడు రోజుల పాటు ఒక గదిలో బంధిస్తారు. ఆ తరువాతనే యువకుడిని విడుదల చేస్తారు. అక్కడి గ్రామాల్లో ఈ వివాహానికి గుర్తింపు ఉంది. రాహుల్ కుమార్ కు కూడా 2023లో ఇలాగే వివాహం జరిగింది.
Also Read: ప్రభుత్వ ఉద్యోగం ఉంది, వధువు కావలెను’.. 50 మహిళలను మోసం చేసిన ముగ్గురు పిల్లల తండ్రి!
అయితే రాహుల్ కుమార్ ఉద్యోగం రీత్యా రాజధాని పట్నాలో ఉండేవాడు. తనతోపాటు భార్యను తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా ఆమె రావడానికి అంగీకరించలేదు. దీంతో అతను ఒంటరిగానే పట్నాలో ఉండి ప్రతినెలా భార్యకు డబ్బులు పంపేవాడు. చాలాసార్లు సెలవు మీద ఇంటికి వచ్చినా రాహుల్ కుమార్ భార్య అక్కడ ఉండేది కాదు. ఆమె ఏదో ఒక కారణం చెప్పి తరుచూ పుట్టింటికి వెళ్లిపోయేది. ఈసారి కూడా అదే జరిగింది. రాహుల్ కుమార్ సెలవు తీసుకొని ఇంటికి వచ్చినప్పుడు అతని భార్య ఇంట్లో లేదు. దీంతో రాహుల్ ఆమెకు ఫోన్ చేసి తిరిగి ఇంటికి రావాలని చెప్పాడు. కానీ అందుకు ఆమె అంగీకరించలేదు.
భార్యను తనే స్వయంగా ఇంటికి తీసుకువచ్చేందుకు రాహుల్ తన అత్తారింటికి వెళ్లాడు. అయితే అక్కడికి వెళ్లి చూడగా.. అతని భార్య మరోపురుషుడితో శృంగారంలో ఉంది. ఆ పురుషుడు మరెవరో కాదు.. ఆమెకు స్వయనా బావ (సోదరి భర్త). ఇదంతా చూసి రాహుల్ కుమార్ కు పట్టరాని కోపం వచ్చింది. రాహుల్ వెంటనే వారిద్దరిపై దాడి చేశాడు. దీంతో అక్కడ పెద్ద గొడవ జరిగింది. కాసేపు తరువాత రాహుల్ ఇంటి బయటికి వచ్చి తన బాబాయ్ కి ఫోన్ చేసి విషయం వివరించాడు. వారందరినీ అక్కడికి వెంటనే రావాలని చెప్పాడు.
అయితే అప్పుడే వెనుక నుంచి రాహుల్ పై అతని భార్య, అత్తమామలు దాడి చేశారు. రాహుల్ ని బాగా చితకబాది.. బలవంతంగా అతడి చేత విషం తాగించారు. ఆ తరువాత ఒక గదిలో బంధించారు. రాహుల్ విషం ప్రయోగం వల్ల కొట్టుమిట్టాడుతూ.. ఎలాగోలా తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి తనకు విషం ఇచ్చి ఒక గదిలో బంధించారని సమాచారం ఇచ్చాడు. కానీ రాహుల్ తల్లిదండ్రులు అక్కడికి చేరే సరికి అతను చనిపోయాడు. మరోవైపు రాహుల్ భార్య, ఆమె కుటుంబం పరారీలో ఉన్నారు.
Also Read: 7 ఏళ్ల బాలుడు కిడ్నాప్.. కిడ్నాపర్లపై పగతో ఆ పిల్లాడు ఎంత పనిచేశాడంటే..
రాహుల్ కుటుంబ సభ్యలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతని భార్య, అత్తమామలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు రాహుల్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. పోస్టు మార్టం రిపోర్టు రాగానే రాహుల్ మరణం కేసులో చర్యలు తీసుకుంటామని స్థానిక పోలీసులు తెలిపారు.