BigTV English

Best Month to Start new House Construction : ఇల్లు నిర్మించేటప్పుడు ఈ నెలలో ప్రారంభిస్తేనే మంచిదా…

Best Month to Start new House Construction : ఇల్లు నిర్మించేటప్పుడు ఈ నెలలో ప్రారంభిస్తేనే మంచిదా…

Best Month to Start new House Construction : చిన్నదైనా, పెద్దదైనా ఏదో ఒక ఇల్లు కట్టుకోవాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. ఆఘడియలు వచ్చినప్పుడు గృహ నిర్మాణం ఎప్పుడు మొదలుపెట్టాలన్న సందేహాలు వస్తుంటాయి. గృహ నిర్మాణమనేది ఏ నెలలో మొదలు పెట్టాలి..ఏ మాసంలో గుంతలు తవ్వాలి…ఏం నెల్లో చేస్తే గృహనిర్మాణానికి ఉత్తమ ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. ఏడాదిలోని పన్నెండు నెలల్లో కొన్ని మాసాల్లో చేపట్టిన గృహ నిర్మాణం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి. తొందరగా ఇంటి నిర్మాణం పూర్తవుతుంది. అంతే కాదు అనేక మార్గాల్లో ధనాదాయం కూడా కలుగుతుంది. చైత్రమాసంలో గృహ నిర్మాణం మొదలు పెడితే ఆర్ధిక పరమైన సమస్యలు వస్తాయి. ధనపరంగా కూడా నష్టం కలుగుతుంది. అందుకే చైత్రమాసంలో ఇంటి నిర్మాణం తలపెట్టవద్దు.


వైశాఖ మాసంలో గృహ నిర్మాణం చేపడితే సకల శుభాలు కలుగుతాయి. అనేక మార్గాల్లో ధనాదయం కలిగి ఇంటి పనులు వేగంగా జరిగిపోతాయి. జేష్ఠమాసంలో ఇల్లు కట్టడం ప్రారంభిస్తే అపమృత్యు దోషాలు కలుగుతాయి. అనుకోని ప్రమాదాలు జరుగుతాయి. ఇంట్లో పెద్ద వాళ్లకు ఆరోగ్య సమస్యలు రావడం, రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. జేష్ఠ మాసంలో ఇల్లు నిర్మాణం వల్ల అప మృత్యు దోషాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆషాడ మాసంలో ఇళ్ల నిర్మాణం చేస్తే పాడి పంట నష్టం సంభవిస్తుందట. పశు సంపదకి నష్టం కలుగుతుంది. శ్రావణ మాసంలో ఇంటి నిర్మాణం చేస్తే అనేక మందికి భుక్తని కలిగించే అదృష్టం కలుగుతుంది. మీతోపాటు ఇంకా పది మందికి ఉపాధి కలిగించే శక్తి మీకు చేకూరుతుంది. అనేక మందిని పోషించే శక్తిని మీకు కలుగుతుంది. అనేక మార్గాల్లో ధనలాభం కలుగుతుంది.

బాద్రపద మాసంలో ఇంటి నిర్మాణం చేస్తే అనారోగ్య సమస్యలు ఇంట్లో శాశ్వతంగా నిలిచిపోతాయని శాస్త్రం చెబుతోంది. ఎప్పుడు ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. ఆశ్వయుజ మాసంలో నిర్మాణం వల్ల కుటుంబ కలహాలు కలుగుతాయి. ఒకరంటే ఒకరు పడకపోవడం లాంటివి జరుగుతాయి. కుటుంబంలో నిత్యం ఏదో ఒక గొడవ వస్తుంది. కాబట్టి ఆశ్వయుజ మాసంలో నిర్మాణం చేపట్టకూడదు. కార్తీక మాసంలో ఇంటి నిర్మాణం చేపడితే సమస్త సంపదలు కలుగుతాయి. ఈ మాసంలో నిర్మాణం చేపడితే సంపాదన మార్గాలు పెరుగుతాయి. అదృష్టం కూడా కలిసి వస్తాయి. మార్గశిర మాసంలో ఇల్లు కట్టడం వల్ల అంత శత్రువు బాధ పెరుగుతుంది. శత్రుత్వాలు కలుగుతాయి.


పుష్యమాసంలో ఇంటి నిర్మాణం వల్ల అగ్ని సంబంధిత సమస్యలు వస్తాయి. అగ్ని ప్రమాద సూచనలు ఎక్కువ ఉన్నాయి. మాఘ మాసంలో ఇంటి నిర్మాణం చేపట్టడం వల్ల శుభా కార్యక్రమాలు ఎక్కువుగా జరుగుతాయి. నిత్యం ఏదో శుభ కార్యక్రమాలు జరుగుతూ అందరూ సంతోషంగా ఉంటారు.ఫాల్గుణ మాసంలో ఇళ్ల నిర్మాణం వల్ల ఇంట్లో బంగారం పోతుంది. వైశాఖ, శ్రావణ, కార్తీక, మాఘ మాసంలో చేపట్టే ఇళ్ల నిర్మాణం వల్ల ధనాభివృద్ధి కలుగుతుంది.

Tags

Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×