BigTV English

Remedy For Black Heads : ఇలా చేస్తే బ్లాక్‌హెడ్స్ మాయం

Remedy For Black Heads : ఇలా చేస్తే బ్లాక్‌హెడ్స్ మాయం

Remedy For Black Heads : అనేక మంది చర్మంపై బ్లాక్‌ హెడ్స్‌తో ఇబ్బంది పడుతుంటారు. చర్మంపై చిన్నసైజులో వచ్చే నల్లని కురుపులు, మచ్చలు ఎంత తొలగించినా మళ్లీ వస్తుంటాయి. డెడ్‌స్కిన్‌ చర్మ రంధ్రాలను పూడ్చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ వస్తాయి. సాధారంగా ముక్కు, గదమ మీద బ్లాక్‌హెడ్స్ ఎక్కువగా మనకు కనిపిస్తాయి. ఒక పాత్రలో నీటిని పోసి వేడి చేయాలి. ఆ తర్వాత నీటి ద్వారా వచ్చే ఆవిరి మీద టవల్‌ పెట్టాలి. వెంటనే ఆ టవల్‌ను బ్లాక్‌హెడ్స్ ఎక్కువగా ఉన్న చోట సున్నితంగా రుద్దాలి, ఈ విధంగా మూడుసార్లు చేస్తే బ్లాక్‌ హెడ్స్‌ నుంచి ఉపశమనం కలుగుతుంది. చిక్కని పెరుగు, శనగపిండి, కాఫీ పొడి పేస్ట్‌లా చేసి ముఖానికి పట్టించాలి. ఈ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ మీద రాసి సున్నితంగా మసాజ్‌ చేసుకోవాలి. 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలా చేసి మామూలు నీటితో ముఖం కడుక్కోవాలి. ఆ తర్వాత ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి, వారానికి రెండుసార్లు ఇలా మసాజ్ చేస్తే బ్లాక్‌హెడ్స్‌ తొలగిపోతాయి. కోడిగుడ్డులోని తెల్లసొనలో రెండు స్పూన్ల బేకింగ్ సోడా కలిసి ముఖానికి 20 నిమిషాలపాటు అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. మసాజ్ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. దీన్ని వారానికి ఒకటి లేదా రెండుసార్లు వేసుకోవచ్చు. పుదీనా ఆకుల పేస్ట్‌తో కూడా బ్లాక్‌ హెడ్స్‌ని ఈజీగా దూరం చేయవచ్చు. ముందుగా పుదీనా ఆకులు, చిటికెడు పసుపును నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆకులను మెత్తగా చేసి ముఖానికి రాసి కాసేపు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత చేతులతో సుతిమెత్తగా మసాజ్ చేయాలి. ఇప్పుడు గోరువెచ్చని లేదా సాధారణ నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. దీంతో నల్లమచ్చలు తొందరగా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×