BigTV English

Rudraksha:రుద్రాక్ష ఎలా పుట్టింది?

Rudraksha:రుద్రాక్ష ఎలా పుట్టింది?

Rudraksha:శ్రీ మహావిష్ణువు కృష్ణావతారం, రామావతారంతో పాటు దశావతారాలతో ఈ జగత్తును ఉద్ధరించారు. ప్రజలను రక్షించేందుకు భగవంతుడు దశావతారాలెత్తారు. ఇందుకు కృతజ్ఞతలు తెలిపే విధంగా ముక్కోటి దేవతలు ఇంద్రునితో పాటు విష్ణువు పలు విలువైన నవరత్నాలను, ఆభరణాలను కానుకగా సమర్పించుకున్నారు.


అయితే పరమేశ్వరుడు మాత్రం ఒకే ఒక రుద్రాక్షను శ్రీ మహావిష్ణువుకు కానుకగా ఇచ్చారు. పరమేశ్వరుడు ఇచ్చిన ఆ రుద్రాక్షను శ్రీపతి కూడా వినయంగా స్వీకరించి.. కంటికి అద్దుకున్నారు. దీన్ని చూసిన దేవతలంతా.. బంగారు, నవరత్నాలు కానుకలిచ్చిన తమను అవమానపరిచినట్లు భావించారు. నల్లటి బొగ్గులా ఉన్న రుద్రాక్షను శ్రీమహావిష్ణువు స్వీకరించడం ఏమిటని దాన్ని పారేయమని నిర్లక్ష్యంగా మాట్లాడారు.

దీన్ని విన్న విష్ణువు తులాభారం వేశారు. ఒక తట్టలో దేవతలు తెచ్చిన బంగారం, నవరత్నాలను వుంచమన్నారు. ఒకవైపు రుద్రాక్షను ఉంచారు. కానీ బంగారు నగలన్నీ రుద్రాక్షకు సరిసమానంగా తూగలేదు. ఇది గమనించిన శ్రీ మహాలక్ష్మి పరమేశ్వరుని వద్ద క్షమాపణలు కోరి ఆ రుద్రాక్షను భద్రంగా తన వద్దే వుంచుకుంది. ఇదంతా చూసిన కుబేరుడు.. ఎప్పుడెప్పుడు పరమేశ్వరుడి రుద్రాక్షను దేవతలు పారేస్తారా..? దాన్ని తీసుకెళ్దామా అని వేచి చూశాడు. పరమేశ్వరుడు ఇచ్చిన రుద్రాక్షకు తన నవనిధులు సమం కావని కుబేరుడు అన్నాడు. అందుకే రుద్రాక్ష వున్న చోట కుబేరుడు, లక్ష్మీదేవి నివాసం వుంటుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.


ఏ ఇంట ఈ రుద్రాక్షను పూజిస్తారో.. అక్కడ ఆర్థిక నష్టం వుండదు. ధనాదాయం వుంటుంది. లక్ష్మీకుబేరుని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. అంతేగాకుండా రుద్రాక్ష మాలను ధరించే వారికి లక్ష్మీకుబేర అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. రుద్రాక్షలో 18 రకాలైన శివమంత్రాలున్నాయి. అందుకే రుద్రాక్ష ఉన్న ఇంట్లో ఈతిబాధలుండవు. ఆర్థిక ఇబ్బందులు అస్సలు వుండవు. అలాగే ఏ ఇంట శ్రీ రుద్రం వినబడుతుందో.. ఆ ఇంటికి కుబేరుడు, శ్రీలక్ష్మి చేరుకుంటారని శివపురాణం చెప్తోంది.


Cockroaches : ఇంట్లో బొద్దింకలు దేనికి సంకేతం…

Gold Slipper : ఆ చెప్పులు చాలా కాస్ట్లీ గురూ..! రేటు రూ.69.40 లక్షలు.. ఎందుకో తెలుసా..?

Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×