BigTV English

Humanoid robots:- హ్యూమనాయిడ్ రోబోలదే భవిష్యత్తు..!

Humanoid robots:- హ్యూమనాయిడ్ రోబోలదే భవిష్యత్తు..!

Humanoid robots:- ఒకప్పుడు కేవలం సినిమాల్లో, గ్రాఫిక్స్‌లో మాత్రమే కనిపించే ఎన్నో వింతలను శాస్త్రవేత్తలు నిజం చేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో కనిపించే ప్రతీ ఒక అద్భుతాన్ని నిజం చేసి చూపిస్తున్నారు. ఒకప్పుడు హ్యూమనాయిడ్ రోబోలు అనేవి అసలు తయారు చేసే వీలు ఉంటుందా అనుకున్న వారిని శాస్త్రవేత్తలు అడ్వాన్స్ టెక్నాలజీలతో అలాంటి రోబోలను తయారు చేసి ఆశ్చర్యపరుస్తున్నారు. త్వరలోనే హ్యామనాయిడ్ రోబోల తయారీ సంచనలంగా మారనుందని తెలుస్తోంది.


రోబోల తయారీ అనేది చాలా కష్టమైన విషయం అనుకున్న దగ్గర నుండి ప్రతీ రంగంలో మనుషులకు సాయం చేయడానికి సరిపడా రోబోలు ఉండేంత వరకు టెక్నాలజీ అభివృద్ధి చెందింది. అయితే రోబోలు అనేవి మొత్తం స్టీల్ బాడీతో బరువుగా ఉంటాయి అనుకుంటుండగానే శాస్త్రవేత్తలు వాటికి మానవ రూపాన్ని ఇచ్చారు. ఇదంతా సైన్స్ అండ్ టెక్నాలజీ వల్లే సాధ్యమయ్యింది. ఒకప్పుడు ఫిక్షనల్ అనుకున్నవి అన్నీ ఇప్పుడు రియాలిటీగా మారుతున్నాయి. త్వరలోనే మరెన్నో వింతలు కూడా నిజం కాబోతున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

పెద్ద పెద్ద టాస్కుల దగ్గర నుండి ఇంటిపని వరకు హ్యూమనాయిడ్ రోబోలు అన్నింటిలో ఇప్పటికే తమ సత్తాను చాటుకున్నాయి. కేవలం మనుషులు చెప్పిన పనులను చేయడం మాత్రమే కాకుండా మనుషుల కదలికలను, మాటలను మిమిక్రీ కూడా చేస్తున్నాయి ఈ హ్యూమనాయిడ్ రోబోలు. పూర్తిగా ఒక మనిషిలాగానే అన్ని పనులు చేసి చూపిస్తున్నాయి. అయినా కూడా వీటిని మరింత మెరుగ్గా తయారు చేయాలని శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు.


రోబోటిక్స్ రంగంలో అభివృద్ధి గురించి చెప్పాలంటే హ్యూమనాయిడ్ రోబోలను ఉదాహరణగా చూపిస్తే చాలు. అలాగే మరింత అడ్వాన్స్ హ్యూమనాయిడ్ రోబోలను కూడా త్వరలోనే చూస్తారని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మరింత కష్టమైన టాస్కులను పర్ఫార్మ్ చేయడానికి, మనుషులతో మనుషులలాగా కలిసిపోవడానికి హ్యూమనాయిడ్ రోబోలు సిద్ధమవుతున్నాయని అన్నారు. కానీ ఒక టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నకొద్దీ దాంతో కొన్ని ఛాలెంజ్‌లు కూడా ఎదిరించాల్సి ఉంటుందని తెలుస్తోంది.

హ్యూమనాయిడ్ రోబోలు అనేవి మనుషుల మధ్య ఎక్కువగా తిరిగే సమయం వస్తే దానికి మనుషులు ఎలా స్పందిస్తారు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని నిపుణులు చెప్తున్నారు. సామాజికంగా, వ్యక్తిగతంగా హ్యూమనాయిడ్ రోబోలు మనుషులపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో గుర్తించాలని అన్నారు. ఇవన్నీ పక్కన పెడితే హ్యూమనాయడ్ రోబోలతో భవిష్యత్తు ఉందని తలుచుకుంటేనే చాలా ఆసక్తికరంగా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ హ్యూమనాయిడ్ రోబోలతో శాస్త్రవేత్తలు చేసే అద్భుతాలు ఏంటో చూడాలి.

Tags

Related News

Heavy Rains: తెలంగాణకు రెడ్ అలర్ట్.. హైదరాబాద్‌లో భారీవర్షాలతో మునిగిపోయే జోన్స్ ఇవే

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Big Stories

×