BigTV English

Brides Feet: పెళ్లికూతురు కాళ్లు కడిగితే నష్టం తప్పదా….

Brides Feet: పెళ్లికూతురు కాళ్లు కడిగితే నష్టం తప్పదా….

Brides Feet:హిందూ సంప్రదాయంలో పెళ్లిళ్లలో చాలా ఆచారాలు ఉంటాయి. అందులో వరుడి కాళ్ళు కడగడం… పెళ్లి కొడుకుని విష్ణు మూర్తిగా భావించి కాళ్ళు కడుగుతారు. కాని లక్ష్మీ దేవిగా భావించే పెళ్లి కూతురి కాళ్ళు మాత్రం కడగరు. వివాహ వేదిక వరకు వరుడు నడుచుకుంటూ వస్తాడు. అదే వధువు అయితే లక్ష్మీ దేవి కాబట్టి కాలు కింద పెట్టకుండా తీసుకొస్తారు. ముహూర్తం అయ్యే వరకు ఆమె కాలు కింద పెట్టకుండా చూసుకుంటారు.


సనాతన సంప్రదాయం లో దానము ఇవ్వడం ఒక భాగం. దానం పుచ్చుకునే వాడు ఇచ్చేవాడిని ఉద్దరిస్తున్నట్టు లెక్క. దానం ఇచ్చే టప్పుడు దానం తీసుకునే అతని పాదాలు కడిగి చేతుల్లో నీరు వదులుతారు. అదే సంప్రదాయం కన్య దానం లోను వర్తిస్తుంది. దానం తీసుకునే వాడు వరుడు కాబట్టి… దానం ఇచ్చే పిల్ల తల్లి తండ్రులు కన్యాదానానికి ముందు కాళ్ళు కడిగి ఇవ్వాల్సి ఉంటుంది. తమ ఇంటికి వచ్చే లక్ష్మీదేవి కాలు కందపోకుండా చూడాన్న భావనతో. ఆమెను తమ మేనమామ వరుస అయ్యే వాళ్ళు పెద్ద గంపలో కూర్చోబెట్టి తీసుకొస్తారు. ఆ గంపను కమలంలా భావిస్తారు. పుట్టింటి తరుపు వాళ్ళు మా అమ్మాయిని కాలు క్రింద పెట్టకుండా పెంచాము కాబట్టి… మీరు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పడం కోసం అలా చేస్తారు. అలా తీసుకొచ్చిన మేనమామలకు బట్టలు కూడా వరుడి తల్లి తండ్రులు కృతజ్ఞతగా పెట్టాలి. అందుకే వధువు కాళ్ళు కడగరు. చివర్లో వధువు చేతులని పాలలో తడిపి ముంచి వరుడికి, వరుడి కుటుంబంలోని వారికి రాస్తారు గా. లక్ష్మీదేవి క్షీర సముద్రంలో పుట్టింది కాబట్టి.

వరుణ్ణి విష్ణువుగా తలచి దానమివ్వడం.అంటే ఈ సృష్టికార్యానికి నీవంతు సహాయం చేయడమే.అది అందరివల్ల అవ్వదు,ఒక మాతృమూర్తి అవ్వడం ఒకరికి జన్మ ఇవ్వడం అందరికి అవుతుందా అవ్వదు కదా.అందుకోసమే దానికి కారణభూతుడవైన నీకు నమస్కారం అని తలిచి కుమార్తె చేయిని అతడి చేతిలో పెట్టడం జరుగుతుంది. కళ్యాణ వేదికపై వరుడ్ని పడమర ముఖంగా కూర్చో బెడతారు. కన్యాదాత తూర్పుముఖంగా కూర్చోబెడతారు. వరుణ్ణి శ్రీమహావిష్ణు స్వరూపునిగా భావించి కన్యాదాత పూజించి సత్కరిస్తాడు.


మొదట కుడికాలు, తరువాత ఎడమ కాలును మామ కడుగుతాడు. కుడికాలుని మహేంద్రుని అంశగానూ, ఎడమ పాదాన్ని ఇంద్రుని అంశగా భావిస్తు న్నాను. నీ పాదాలను రక్షించే దేవతలను పూజించిన ఈ జలం నా శత్రువులను కాల్చివేస్తుందని మామ చెప్పినట్లుగా ఉండే మంత్రాలను పురోహితులు చదువుతారు. కాళ్లు కడిగిన నీళ్లను కన్యాదాత దంపతులు కొద్దిగా శిరస్సుపై చల్లుకోవడం ఆచారం. అర్ఘమిచ్చి, ఆచమనం చేయించిన తరువాత మధుపర్కం అందిస్తారు.

Tags

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×