BigTV English

New House: కొత్త ఇల్లు కట్టుకుంటే ఏడాది తర్వాతే పెళ్లిళ్లు చేయాలా…?

New House: కొత్త ఇల్లు కట్టుకుంటే ఏడాది తర్వాతే పెళ్లిళ్లు చేయాలా…?

New House: సాధారణంగా ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత చేసే కార్యక్రమం గృహ ప్రవేశం. ఈ గృహ ప్రవేశం సందర్భంగా ఇంటి కళ్యాణం కూడా చాలా చోట్ల ఇళ్లలో నిర్వహించే ఆచారం ఉంది. దీన్నే వాస్తు కళ్యాణం కూడా అంటారు. లక్ష్మీనారాయణ స్వరూపాలుగా… ఇంట్లోనే రావి చెట్టు, వేప చెట్టు కొమ్మల్ని తీసుకొచ్చి దోవతి,చీర కట్టి వాస్తు కళ్యాణం పేరిట ఇంటి కళ్యాణం నిర్వహిస్తారు. 48మంది దేవతలతో ఉన్న వాస్తుమంటపం కూడా ఉంటుంది. నాంది పాలకలు కూడా ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ చేస్తే పితృ దేవతలు సంతోషంగా ఆ ఇంట్లో ఉంటారు. వారి కోసమే ఈ ఇంటి కళ్యాణం నిర్వహిస్తారు. ఇంటి కళ్యాణం ఆచరించే వాళ్లు మాత్రమే ఇంట్లో ఏడాది వరకు పెళ్లి చేయకూడదు. ఇంటి కళ్యాణం పరంపరంగా లేని వాళ్లు గృహ ప్రవేశం తర్వాత పెళ్లిళ్లు చేసుకోవచ్చు. ఈ నియమాన్ని పాటించాల్సిన పనిలేదు.
సంప్రదాయం ప్రకారం కళ్యాణం తర్వాత గృహప్రవేశం .అంటే కొత్త ఇంట్లోకి ప్రవేశం ఉంటుంది.


వాస్తుశాస్త్రం కొన్ని సూచనలు చేస్తోంది. దీని ప్రకారం సూర్యుడు కుంభరాశిలో సంచరించే కాలం మినహా మిగిలిన మాసాలన్నీ శుభప్రదమైనవిగా వాస్తుశాస్త్రం పేర్కొంటోంది. అదే సమయంలో కార్తీక, మార్గశిర మాసాలు మధ్యస్థ ఫలప్రదమైనవిగా వాస్తుశాస్త్రం చెబుతోంది. అలాగే నూతన గృహ ప్రవేశానికి ఉత్తరాయణం మంచి కాలమని వాస్తుశాస్త్రం ఘోషిస్తోంది.గృహ ఆరంభ ముహూర్తం చేసిన తర్వాత ఇల్లు కట్టడం ప్రారంభించినపుడు ఇంటికి నాలుగు దిక్కులలో పంచ లోహంతో చేయించిన మత్స్యయంత్రాలకు శాస్త్రోక్త విధి విధానాలతో ప్రాణ ప్రతిష్ట చేయించి గృహ ప్రవేశానికి ముందే సమస్త వాస్తు దోషాలను తొలగించే శక్తివంతమైన నాలుగు మత్స్యయంత్రాలు, నవరత్నాలు భూ స్థాపితం చేయించాలి. జనవరి 2023లో గృహ ప్రవేశ ముహూర్తానికి 3 రోజులు ఉన్నాయి. జనవరి 25, 27,30 తేదీలలో ముహూర్తాలు ఉన్నాయి.


Related News

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Big Stories

×