E-Paper
Advertisement

Instead of Rice : అన్నంకు బదులు ఇవి తింటే ఆరోగ్యం మీ సొంతం

Instead of Rice : అన్నంకు బదులు ఇవి తింటే ఆరోగ్యం మీ సొంతం
Advertisement

Instead of Rice : డయాబెటిస్‌లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఎక్కువవడంతో డాక్టర్లు తెల్ల బియ్యాన్ని ఎక్కువగా తీసుకోవద్దని సలహాలు ఇస్తుంటారు. ఇన్సులిన్ స్థాయి పెరగడం, తగ్గడం, బద్ధకం, బరువు పెరగడంతో ముడిపడిన చాలా సాధారణ కార్బోహైడ్రేట్లు బియ్యంలో ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలో మనం తెల్ల బియ్యానికి ప్రత్యామ్నాయంగా పోహా తినవచ్చు. పోహా, బియ్యం రెండూ కూడా వరి నుంచి వస్తాయి. కానీ పోహాను తక్కువ ప్రాసెసింగ్‌ చేస్తారు. అందుకే ఇది బియ్యం కంటే ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

పోహాను అల్పాహారంగా తినవచ్చు. ఇది జీర్ణవ్యవస్థపై అసలు ఒత్తిడి కలిగించదు. అంతేకాకుండా ఉబ్బరం కలిగించదు. మీరు ఏదైనా వెంటనే తినాలనుకున్నప్పుడు ఇది మంచి ఆహారంగా ఉంటుంది. బ్లడ్‌లో షుగర్‌ లెవెల్స్‌ ఒక్కసారిగా పెరగడాన్ని నియంత్రించడానికి పోహా అద్భుతంగా పనిచేస్తుంది. పోహాలోని పీచు పదార్ధం షుగర్‌ను రక్తప్రవాహంలోకి నిరంతరం విడుదల చేస్తుంటుంది. కూరగాయలతో వండిన ఒక గిన్నె పోహాలో 250 కేలరీలు ఉంటాయి. అంతేస్థాయిలో ఫ్రైడ్‌ రైస్‌లో కూడా 333 కేలరీలు ఉంటాయి.

Advertisement

ఇది కూడా ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. కొందరు టేస్ట్‌ కోసం కాల్చిన వేరుశెనగలను కూడా కలుపుకుంటారు. కాకపోతే ఇవి కేలరీల సంఖ్యను పెంచుతాయి. అందుకే బరువు తగ్గాలంటే అన్నానికి బదులు పోహా తినడం ఉత్తమం. పోహాలో ఉండే ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు మంచి బ్యాక్టీరియాను నిలుపుకుంటుంది. పేగులను ఆరోగ్యంగా ఉంచడానికి పనిచేస్తుంది. మరోవైపు బియ్యంలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. దీంతో బరువు తగ్గాలనుకునే వారు తినకుండా ఉంటారు. అంతేకాకుండా అన్నం మనల్ని రోజంతా బద్ధకంగా ఉంచుతుంది.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×