BigTV English

Betting app ban : మహాదేవ్ యాప్ సహా 22 బెట్టింగ్ యాప్‌లపై నిషేధం విధించిన కేంద్రం

Betting app ban : దేశంలోని 22 బెట్టింగ్ యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ బెట్టింగ్ యాప్‌లలో మహాదేవ్ బుక్, రెడ్డిఅన్నప్రెస్టోప్రో వంటి పాపులర్ యాప్ కూడా ఉన్నాయి. ఈ యాప్‌లపై నిషేధం విధిస్తూ ఎలెక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆదివారం ఆదేశాలు జారీ చేసింది.

Betting app ban : మహాదేవ్ యాప్ సహా 22 బెట్టింగ్ యాప్‌లపై నిషేధం విధించిన కేంద్రం

Betting app ban : దేశంలోని 22 బెట్టింగ్ యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ బెట్టింగ్ యాప్‌లలో మహాదేవ్ బుక్, రెడ్డిఅన్నప్రెస్టోప్రో వంటి పాపులర్ యాప్ కూడా ఉన్నాయి. ఈ యాప్‌లపై నిషేధం విధిస్తూ ఎలెక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆదివారం ఆదేశాలు జారీ చేసింది.


ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలో ఇటీవలే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్ (ఇడి) అధికారులు జరిపిన దాడులలో ఈ బెట్టింగ్ యాప్ సిండికేట్ వ్యవహారం బయటపడింది. చట్టవిరుద్ధంగా ఈ బెట్టింగ్ యాప్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న కొంతమందిని ఇడి అధికారులు అరెస్టు చేశారు. వీరిలో మహాదేవ్ బెట్టింగ్ యాప్ నిర్వహకులు కూడా ఉన్నారు. మనీ లాండరింగ్ చట్టం కింద వీరిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఛత్తీస్ గడ్ ప్రభుత్వం గత 18 నెలలుగా చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్న ఈ బెట్టింగ్ యాప్‌లపై విచారణ చేస్తోంది, కానీ ఏ చర్యలు తీసుకోలేదు అని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్ అధికారులు తెలిపారు.


దుబాయ్ నుంచి ఇటీవలే వచ్చిన అసీం దాస్ అనే ఒక వ్యక్తి రూ.5 కోట్ల తీసుకొని ఛత్తీస్ గడ్ వస్తుండగా.. అతడిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్ (ఇడి) అధికారులు పట్టుకున్నారు. అతడిని విచారణ చేయగా.. అసీం దాస్ వ్యక్తి వెనకాల మహాదేవ్ యాప్ నిర్వహకులు, ఛత్తీస్ గడ్ ముఖ్యమంత్రి ఉన్నట్లు తెలిసిందని అధికారులు తెలిపారు. పట్టుబడ్డ డబ్బు ఎన్నికల ఖర్చు కోసమే తీసుకెళుతున్నాడని అన్నారు.

అయితే ఈ ఆరోపణలను ఛత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ వ్యతిరేకించారు. ఇదంతా కేంద్రంలోని బీజేపీ పెద్దలు తనపై కక్షపూరితంగా చేస్తున్నారని ఆయన చెప్పారు. త్వరలో ఛత్తీస్ గడ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఉండడంతో కావాలనే కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసుందుకు బీజేపీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్‌ని తన స్వార్థం కోసం ఉపయోగిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ విషయంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రచారం కోసం చట్టవ్యతిరేక పనుల ద్వారా సంపాదించిన డబ్బును ఉపయోగిస్తోందని, పైగా భగవంతుడి పేరును(మహాదేవ్)ను ఇలాంటి కార్యాల కోసం వాడుకుంటోందని మండిపడ్డారు.

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×