BigTV English

Importance of nelaganta : నెలగంట ఎప్పుడు పెడతారు

Importance of nelaganta : నెలగంట ఎప్పుడు పెడతారు

Importance of nelaganta : సూర్యుడు ధనూ రాశిలో ప్రవేశించినప్పటి నుంచి భోగి పండుగ వరకు ఉన్న కాలం పరమ పవిత్రమైన నెలగంట అంటారు. నెలగంటనే ధనుర్మాసమని అంటారు. నెలగంట, ధనుర్మాసం రెండూ మార్గశిర మాసంలో మొదలవుతాయి. గోదా దేవి శ్రీవతాన్ని ఆచరించి శ్రీరంగ నాథుడ్ని చేరుకుంది. ప్రతీ ఏటా ధనుర్మాసం ప్రారంభమైన రోజునే నెలగంట పెడతారు. ఆ సమయంలో సింహాద్రి అప్పన్న స్వామికి తెల్లవారజామున సుప్రభాతం, ఆరాధన సేవ నిర్వహిస్తారు. దాని తర్వాత గంట మోగిస్తారు. దీన్ని నెలగంట పెట్టడం అంటారు. గోదాదేవి సన్నధిలో అమ్మవారికి విన్నపం చేస్తారు. తర్వాత నెలగంట పెట్టినట్టు పూజారులు భక్తులకు ప్రకటిస్తారు.


నెలగంట మోగింది మొదలు పెద్ద పండుగ సంక్రాంతి వరకు సంబరాలు సంబరాలు మొదలవుతాయి. నెలగంట పట్టిన అన్ని రోజు శుభకార్యాలు లాంటివి నిర్వహించకూడదు. ధనుర్మాసం మొత్తం భగవంతుని ఆరాధనకు మాత్రమే అనుకూల సమయం. పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు చేయడానికి పనికి రాదు. విష్ణువును మాత్రమే ఆరాధించాలని శాస్త్రం చెబుతోంది . తెలుగు వారికి మాత్రమే ఈ నెలలో ఎలాంటి పెళ్లిళ్లు తలపెట్టరు. భగవత్ ఆరాధనతో పండుగ వాతావరణంలో ఈనెల అంతా ఉంటుంది.

పంచామృతాలతో శ్రీమహావిష్ణువును అభిషేకించాలి. అభిషేకానికి శంఖం ఉపయోగించడం మంచిది. తులసీ దళాలు, పూలతో అష్టోత్తర సహస్రనామాలతో స్వామిని ఆరాధించి నైవేద్యం నమర్పించాలి. విష్ణు కథలను చదవటం, తిరుప్పావై పఠించటం ఈ నెలరోజులూ చేయాలి. అలా చేయలేని వారు పదిహేను రోజులు, 8 రోజులు లేదా కనీసం ఒక్క రోజైనా ఆచరించవచ్చు. వ్రతాచరణ తర్వాత బ్రహ్మచారికి దానమిస్తూ ఈ శ్లోకం పఠించి, ఆశీస్సులు అందుకోవాలి.


Tags

Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×