E-Paper
Advertisement

Vehicles in Rural Areas : పల్లెల్లో వాటికి పెరుగుతున్న డిమాండ్

Vehicles in Rural Areas : పల్లెల్లో వాటికి పెరుగుతున్న డిమాండ్
Advertisement

Vehicles in Rural Areas: దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో వాహనాల అమ్మకాలు పెరుగుతున్నాయి. కరోనా టైమ్ నుంచి గ్రామీణ మార్కెట్లో వాహనాలకు తగ్గిపోయిన డిమాండ్… గత రెండు నెలల నుంచి పుంజుకుంది. రూరల్ ఏరియాల్లో అత్యధికంగా అమ్ముడుపోయే చిన్న కారు మారుతి ఆల్టో.. గత మూడు నెలల కాలంలో రికార్డు స్థాయిలో సేల్ అయింది. ఏకంగా 42.5 శాతం పెరిగి… 61,767 అల్టో కార్లు అమ్ముడయ్యాయి. ఆల్టో కే10 పేరుతో తీసుకొచ్చిన కొత్త మోడల్‌ కూడా అమ్మకాలు పెరగడానికి కారణమైంది.

ఇక టూ వీలర్ మార్కెట్ కూడా గ్రామీణ ప్రాంతాల్లో పుంజుకుంటోంది. అక్టోబర్‌లో రూరల్ ఏరియాల్లో టూ వీలర్ విక్రయాలు 41 శాతం పెరిగితే, నవంబర్‌లో 24 శాతం వృద్ధి సాధించాయి. దేశంలో ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో మొదటి స్థానంలో ఉన్న హీరో మోటో కార్ప్‌.. సానుకూల వినియోగ సెంటిమెంట్, ఆర్థిక కార్యకలాపాల మద్దతుతో… వచ్చే క్వార్టర్లో అమ్మకాలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తోంది. సాగు బలంగా ఉండడం, వివాహాల సీజన్‌ కారణంగా… సేల్స్ పెరుగుతాయని భావిస్తోంది.

Advertisement

సాధారణంగా పల్లెల్లో డిమాండ్ ఎప్పుడూ సీజనల్‌గా ఉంటుంది. అయితే గత మూడు నాలుగేళ్లుగా వర్షాలు మెరుగ్గా ఉండటం, రిజర్వాయర్లలో నీటి నిల్వలు సరిపడా ఉండటం, సాగు కూడా బాగానే ఉండటంతో… గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ బలంగా ఉందని కంపెనీలు అంటున్నాయి. ఇక రూరల్ ఏరియాల్లో తగ్గిన ఎఫ్‌ఎంసీజీ డిమాండ్‌… వచ్చే ఏడాది ఆరంభం నుంచి మెరుగుపడుతుందని కంపెనీలు భావిస్తున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతో… గత ఏడాది కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులకు డిమాండ్‌ తగ్గింది. ఇప్పుడు ద్రవ్యోల్బణం దిగొస్తుండడం… మరోవైపు బలమైన సాగు, పంటల మద్దతు ధరలతో… డిమాండ్‌ ఇకపై బలపడుతుందని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో వచ్చే క్వార్టర్లోనూ డిమాండ్‌ స్థిరంగా ఉంటుందని ఆశిస్తున్నాయి.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×