Big Stories

Intelligence Bureau Recruitment: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 226 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీ

Intelligence Bureau Recruitment: నిరుద్యోగులకు న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్‌కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా ఐబీ పరిధిలోని సబ్సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

- Advertisement -

మొత్తం పోస్టులు: 226 పోస్టులు.. (యూఆర్‌- 93, ఈడబ్ల్యూఎస్‌-24, ఓబీసీ- 71, ఎస్సీ- 29, ఎస్టీ- 9) ఉన్నాయి.

- Advertisement -

విభాగాల వారీ ఖాళీలు: కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 79, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్‌లో 147.

అర్హతలు: బీఈ, బీటెక్‌ (ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్‌ టెలి-కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్/ ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ ఇంజినీరింగ్/ కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇంజినీరింగ్). లేదా ఎంఎస్సీ (ఎలక్ట్రానిక్స్/ ఫిజిక్స్- ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్/ కంప్యూటర్ సైన్స్) లేదా పీజీ (కంప్యూటర్ అప్లికేషన్స్). గేట్ 2021/ 2022/ 2023 స్కోరు తప్పనిసరిగా ఉండాలి.

వయోపరిమితి: 12-01-2024 నాటికి 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.44,900-1,42,400.

ఎంపిక ప్రక్రియ: గేట్ స్కోరు/ ఇంటర్వ్యూ, సైకోమెట్రిక్/ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము: జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.100.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12.01.2024.

దరఖాస్తు రుసుము చెల్లింపు చివరి తేదీ: 16.01.2024.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News