BigTV English

Pothole Fixing Robot : గుంతలను గుర్తించి, పూడ్చేసే ఏఐ రోబో..

Pothole Fixing Robot : గుంతలను గుర్తించి, పూడ్చేసే ఏఐ రోబో..
Pothole Fixing Robot

Pothole Fixing Robot : పాట్‌హోల్ రోబాట్.. అంటే గుంతలను పూడ్చేసే రోబో. కృత్రిమ మేధ(AI) ఆధారంగా తనంతట తానుగా గోతులను, పగుళ్లను గుర్తించడమే కాకుండా.. అప్పటికప్పుడు తారు, కంకరతో వాటిని పూడ్చేసే హైటెక్ యంత్రమిది. ఈ తరహా రోబాట్‌‌కు రూపకల్పన జరగడం ప్రపంచంలో ఇదే తొలిసారి.


ఈ సెల్ప్ డ్రైవింగ్ రోబాట్‌ను బ్రిటన్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. టెక్ కంపెనీ రోబోటిజ్3డీ దీనిని తయారు చేసింది. రానున్న కొన్ని నెలల్లో హెర్ట్ ఫోర్డ్‌షైర్ వీధుల్లో దీనిని పరీక్షిస్తారు. చూసేందుకు సైబర్‌ట్రక్‌లా ఉంటుంది. రోడ్లపై పగుళ్లు, గుంతలను మన కన్నా వేగంగా గుర్తిస్తుందిది.

మరీ పెద్ద పెద్ద గుంతలు కాదు కానీ.. చిన్నపాటి పాట్ హోల్స్‌ను, కొద్దిపాటి పగుళ్లను దీని సాయంతో పూడ్చేసే వీలుంది. దీనిని ARRES (Autonomous Road Repair System) PREVENT మెషిన్‌గా వ్యవహరిస్తున్నారు. రోడ్లపై ఏర్పడే పగుళ్లలో నీరు చేరినప్పుడు అవి గుంతలుగా మారతాయి. అలా నీరు ఉన్న సమయంలో వేగంగా వెళ్లే వాహనాలతో ఆ ప్రాంతంలో కంకర రాళ్లు చెల్లాచెదురవుతాయి.


కంకర తేలేసరికి గుంతలు పెద్దవిగా మారతాయి. సో.. పాట్ హోల్ రోబాట్ రోడ్లపై అతి చిన్న పగులును సైతం ఇట్టే పసిగట్టేస్తుంది. తద్వారా అవి గోతులుగా మారకుండా అడ్డుకుంటుంది. ఇలాంటి యంత్రం కోసం బ్రిటన్ పరిశోధకులు మూడేళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. ఎట్టకేలకు అవి ఓ కొలిక్కి వచ్చాయి.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×