Big Stories

Mango Leaves : ఎండిపోయిన మామిడి ఆకులు గుమ్మానికి ఉంటే నష్టమా?

Mango Leaves : ఇంట్లో శుభకార్యం జరిగినా, పండుగ, పబ్బం వచ్చినా సింహద్వారానికి, గుమ్మాలకు మామిడి తోరణాలు కడుతూ ఉంటాం. పూల దండలతో అలంకరణ చేసే సంప్రదాయం హిందూమతంలో ఉంది. అయితే అవి కొన్ని రోజులు తర్వాత ఎండిపోతాయి

- Advertisement -

దండలు కానీ, తోరణాలు ఎండిపోయిన తర్వాత తీసేయకపోతే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. కాబట్టి వెంటనే వాటిని తీసేసి కావాలంటే మళ్లీ కొత్తవి కట్టుకోవచ్చు. సింహద్వారానికి పెట్టిన మామిడి తోరణాలు ఎండిపోతే తొలగించి మూలానక్షత్రం రోజు కానీ మరో రోజు కానీ కొత్తవి పెట్టండి. వాస్తు శాస్త్రప్రకారం ఎండిపోయిన తోరణాలు , మాలలు గుమ్మానికి ఉండరాదు. లక్ష్మీదేవి కటాక్షించాలంటే ఎండిన తోరణాలు తొలగించాలి.

- Advertisement -

మామిడి ఆకుల గురించి రామాయణ,మహాభారత గ్రంధాలలో కూడా ప్రముఖంగా ప్రస్తావించారు.ప్రతి శుభకార్యంలోను మంగళ తోరణాలు కట్టటానికి మామిడి ఆకులను తప్పనిసరిగా ఉపయోగిస్తాం. మామిడి ఆకులో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని మన పెద్దలు చెప్పుతూ ఉంటారు.అందువల్ల ఆ ఆకులతో గుమ్మానికి తోరణం కడితే ఇంటిలోకి ధనం చేరి ఆ ఇల్లు సిరిసంపదలతో తుల తూగుతుంది.

తోరణాలుగా మామిడి ఆకుల్ని మాత్రమే ఉపయోగించడం శాస్త్రీయ కోణం కూడా ఉంది. మామిడి నిద్రలేమిని పోగొడుతుంది. ఇంట్లో ఉండే ఆక్సిజన్ శాతం పెరిగి స్వచ్ఛమైన గాలి మనకు లభిస్తుంది. పండుగల వేళ పని ఒత్తిడిని, శ్రమను తగ్గించేందుకే మామిడాకు ఉపయోగపడుతుంది. మామిడి కోరికన కోరికలు తీరుస్తుంది. పర్వదినాల్లో , యజ్ఞయాగాదుల్లో ధ్వజారోహణం చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. అందుకే మామాడి తోరణాల ఆచారం వచ్చింది.

మామిడి ఆకులు శుభానికి చిహ్నాలు. ఆవరణలోని ద్వారానికి కడితే ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ప్రసారమవుతుంది. ఇంట్లో ఏవైనా దుష్ట శక్తులు ఉన్నట్లయితే ఆ శక్తులు వెళ్లిపోయి దేవతలు అనుగ్రహిస్తారు. మామిడి తోరణాలను చూస్తే ఎవరికైనా మనస్సు ప్రశాంతంగా మారుతుందట.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News