Big Stories

Twitter Employees : ట్విట్టర్‌ ఉద్యోగుల మెడపై కత్తి

Twitter Employees : 44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్ ను కొన్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్… ముందుగా చెప్పినట్లే సంస్థలో ఉద్యోగుల్ని తొలగించబోతున్నాడు. ఎవరెవర్ని తీసేయాలో ఓ జాబితా తయారు చేయాలని… మస్క్, మేనేజర్లను ఆదేశించినట్లు చెబుతున్నారు. దాంతో… ఎవరి ఉద్యోగం ఉంటుందో.. ఎవరి ఉద్యోగం ఊడుతుందోనని ట్విట్టర్ ఎంప్లాయిస్ ఆందోళనలో ఉన్నారు.

- Advertisement -

ఇప్పటికే సీఈఓ, సీఎఫ్‌ఓ సహా ఇతర కీలక పదవుల్లో ఉన్న ఉద్యోగుల్ని తొలగించిన మస్క్… ఇప్పుడు ఉద్యోగుల సంఖ్యను తగ్గించడంపై దృష్టి పెట్టాడని న్యూయార్క్‌ టైమ్స్‌ వెల్లడించింది. సంస్థను కొన్న మర్నాటి నుంచే ఉద్యోగుల తొలగింపు ప్రణాళికల్ని అమలు చేయడం ప్రారంభించాడని పేర్కొంది. విభాగాలను బట్టి ఉద్యోగుల తొలగింపుపై జాబితా ఇవ్వాలని… సంస్థ మేనేజర్లను మస్క్ కోరినట్లు చెబుతున్నారు. కొన్ని విభాగాల్లో ఎక్కువ మందిపై వేటు పడనుండగా… మరికొన్ని విభాగాల్లో తక్కువ మందిని తీసేయబోతున్నారు. నవంబరు 1వ తేదీన ఉద్యోగులు స్టాక్‌ గ్రాంట్స్‌ అందుకోబోతుండటంతో… ఆలోపే తీసేయాల్సిన వారిని తీసేస్తే… పరిహారం కింద వారికి స్టాక్ గ్రాంట్స్ ఇవ్వనక్కర్లేదని మస్క్‌ భావిస్తున్నాడు.

- Advertisement -

ట్విట్టర్ డీల్ ను పూర్తి చేయడానికి నాలుగు రోజుల ముందు నుంచే… సంస్థలోని ఉద్యోగుల తొలగింపుపై మస్క్ లీకులిస్తూ వస్తున్నారు. ఏకంగా 75 శాతం మంది ఉద్యోగుల్ని తొలగించబోతున్నట్లు భారీ స్థాయిలో ప్రచారం జరిగింది. అందులో నిజం లేదని మస్క్ కొట్టిపారేసినా… ఇప్పుడు ఆయన చేతల్ని చూస్తుంటే… ట్విట్టర్ ఉద్యోగుల మెడపై కత్తి వేలాడుతున్నట్టే ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News