BigTV English

Spiritual Stories : పాపనాశనంలో ఆ ఒక్కరోజే స్నానం చేస్తేనే ఫలితం ఉంటుందా….

Spiritual Stories : పాపనాశనంలో ఆ ఒక్కరోజే స్నానం చేస్తేనే ఫలితం ఉంటుందా….

Spiritual Stories : దేశంలో వెలిసిన ప్రాచీన తీర్థాలకు ఆధ్మాత్మికమైన కొన్ని కథలు పురాణాలలో, వ్యాసాలలో, గ్రంథాలలో వర్ణించారు. దేవతలు, రాక్షసుల మధ్య జరిగిన సంఘర్షణలో కొన్ని తీర్థస్థానాలు పుట్టుకువస్తే… మరికొన్ని తీర్థాలు మునులు చేసిన ఘోర తపస్సుకు నిలయంగా వెలిశాయి. పాపశానంలో వచ్చే నీరు కొండల్లోంచి సహజసిద్ధంగా వచ్చే జలధార ఇది. ఈ జలాల్లో స్నానమాచరించడం ద్వారా పాపాలు నశించిపోతాయన్నది భక్తుల విశ్వాసం. అందుకే దీనికి పాపనాశనం తీర్థమనే పేరు స్థిరపడింది.


తెలిసీ చేసినా, తెలియక చేసినా సమస్త పాపాలు పశ్చాతాపంతో మూడు రోజులు స్నానమాచరించిన సమస్త దోషాలు పోతాయని శ్రీవెంకటేశ్వర మహత్మ్యంలో ఉంది. చిత్తా నక్షత్రాన చైత్ర పౌర్ణమి ఉదయం ఆకాశ గంగంలో స్నానం ఆచరిస్తే పాపాలన్నీ నీటితో కడిగిన మురికిలా పాపాలు పోతాయని విశ్వాసం. భక్తుల నీటి అవసరాల కోసం ఇక్కడ ఏర్పాటు చేసిన డ్యామ్ కూడా చూడవచ్చు. తొలుత పాపవినాశనం తీర్థ జలాలను స్వామి వారికే వినియోగించేవారు. ఆలయానికి దూరంగా ఉండడంతో ప్రస్తుతం ప్రత్యేక దినాల్లోనే ఈ జలాలను తీసుకెళుతున్నారు.

ఆలయానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోని పాపవినాశనానికి వెళ్లే మార్గంలోనే ఆకాశ గంగ ఉంది. ఇది కూడా సహజసిద్ధ తీర్థమే. ఈ తీర్థంతో శ్రీవెంకటేశ్వస్వామి వారికి నిత్యాభిషేకం జరుపుతూ ఉంటారు. తిరుమలలోని పవిత్ర తీర్థాల్లో ఇదొకటి. ఇది ఇది శ్రీవారి ఆలయానికి ఉత్తరదిశలో ఉంది. ఈ ఆకాశగంగ నీళ్ళు ఎక్కడి నుండి వస్తున్నాయో ఇప్పటికి తెలియని ఒక అంతుచిక్కని రహస్యం. సహజసిద్దంగా ప్రవహించే ఈ తీర్థం వెనక వివిధ రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి.


Related News

Navratri 2025: దృష్టశక్తులు తొలగిపోవాలంటే.. నవరాత్రి సమయంలో ఇలా చేయండి !

Bastar Dussehra Festival: అక్కడ 75 రోజుల పాటు దసరా ఉత్సవాలు.. ప్రాముఖ్యత ఇదే!

Navratri Day 5: నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారిని.. ఏ విధంగా పూజించాలి ?

Bathukamma: అలిగిన బతుకమ్మ అనే పేరు ఎలా వచ్చింది ? ఈ రోజు నైవేద్యం ఎందుకు సమర్పించరు ?

Navratri Day-4: నవరాత్రి నాల్గవ రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: ఐదో రోజు అట్ల బతుకమ్మ.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటి ?

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Big Stories

×